News December 29, 2024
ICC వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ నామినీలు వీరే
వన్డే క్రికెట్ ఆఫ్ ది ఇయర్ నామినీలను ఐసీసీ ప్రకటించింది. ఈ జాబితాలో అజ్మతుల్లా ఒమర్జాయ్-అఫ్గానిస్థాన్, వనిందు హసరంగ, కుశాల్ మెండిస్-శ్రీలంక, షెర్ఫానే రూథర్‌ఫర్డ్-వెస్టిండీస్ ఉన్నారు. ఈ ఏడాది వన్డేల్లో వీరు అత్యుత్తమ ప్రదర్శన చేయడంతో ఐసీసీ వీరిని ఎంపిక చేసింది. భారత్ నుంచి ఏ ఒక్క ప్లేయర్ కూడా ఈ లిస్టులో చోటు దక్కించుకోలేదు.
Similar News
News January 4, 2025
పావురాలను మేపుతున్నారా.. ఈ ప్రమాదం తెలుసా?
చాలామందికి పావురాల్ని మేపడం ఓ హాబీగా ఉంటుంది. వారు వేసే మేత కోసం రోడ్డుపై, కరెంటు తీగలపై వందలాదిగా పావురాలు చేరుతుంటాయి. కానీ వాటి వల్ల తీవ్రస్థాయిలో శ్వాస సంబంధిత అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటిలో ఉండే క్రిప్టోకోకస్ అనే ఫంగస్ కారణంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, మెనింజైటిస్ వంటి వ్యాధులు వస్తాయని.. పలు రోగకారకాలకూ పావురాలు వాహకాలని పేర్కొంటున్నారు.
News January 4, 2025
అకౌంట్లోకి రూ.20,000.. ఎప్పుడంటే?
AP: కేరళ తరహాలో రాష్ట్రంలో కూడా హార్బర్లు, జెట్టీలు, ల్యాండింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మత్స్యకారులకు వేట నిషేధం ప్రారంభానికి ముందే ఏప్రిల్ 1న వారి ఖాతాల్లో రూ.20,000 చొప్పున జమ చేస్తామని వెల్లడించారు. నిన్న ONGC పైపులైన్ వల్ల నష్టపోయిన కోనసీమ, కాకినాడ జిల్లాల మత్స్యకారులకు ఆ సంస్థ విడుదల చేసిన నష్టపరిహారాన్ని 23,450 మందికి రూ.63,200 చొప్పున పంపిణీ చేశారు.
News January 4, 2025
హైదరాబాద్‌లో తప్పిన విమాన ప్రమాదం
TG: హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమాన ప్రమాదం తప్పింది. ముంబై-విశాఖ ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానంలోని 144 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఇటీవల వరుసగా విమాన ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే