News December 29, 2024
అప్పులు చేయడమేనా చంద్రబాబు విజన్?: బుగ్గన

AP: అప్పులు చేయడంలో కూటమి సర్కార్ దూసుకెళ్తోందని వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. అప్పులు చేయడమేనా చంద్రబాబు విజన్ అని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లో బుగ్గన మీడియాతో మాట్లాడారు. ‘6 నెలల్లోనే రూ.1,12,750 కోట్ల అప్పులు చేశారు. ఈ అప్పులన్నీ ఎవరు కడతారు? ఇప్పటివరకు మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. చంద్రబాబు మేనిఫెస్టో ఏమయ్యింది?’ అని ఆయన ప్రశ్నించారు.
Similar News
News September 24, 2025
పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

AP: వివిధ శాఖల్లోని 47 పోస్టుల భర్తీకి APPSC <
News September 24, 2025
మెదడు ఆరోగ్యం కోసం పాటించాల్సిన సూత్రాలు

మెదడు ఆరోగ్యం కోసం వైద్యులు కొన్ని సూచనలు చేస్తున్నారు.
*BP కంట్రోల్‌లో ఉంచుకోండి(<120/80 mmHg). ఇది మెదడులోని రక్తనాళాలను దెబ్బతీసి, రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని పెంచి పక్షవాతానికి కారణమవుతుంది. *షుగర్ కంట్రోల్‌లో ఉండేలా చూసుకోండి(HbA1c <5.7%). *రక్తంలో అధిక కొలెస్ట్రాల్ మెదడుకు రక్త సరఫరాను తగ్గించి, పనితీరును దెబ్బతీస్తాయి. *మద్యపానం & ధూమపానం మానుకోండి. వ్యాయామం చేయండి. రోజూ 8Hrs నిద్రపోండి.
News September 24, 2025
ఎమర్జెన్సీ నంబర్లు.. సేవ్ చేసుకోండి

అత్యవసర సమయంలో కింది ఎమర్జెన్సీ నంబర్లకు ఫోన్ చేసి ప్రాణాలు కాపాడుకోవచ్చు.
*112- అన్ని అత్యవసర పరిస్థితుల్లో దీనికి కాల్ చేయవచ్చు. (పోలీసులు, అంబులెన్స్, ఫైరింజన్)
*100- పోలీసులు
*101- అగ్నిప్రమాదాలు, గ్యాస్ లీక్
*102- గర్భిణులు, పిల్లలకు ఫ్రీ అంబులెన్స్ *108- మెడికల్ ఎమర్జెన్సీ *1091- మహిళల వేధింపులకు హెల్ప్ లైన్ *1930- డిజిటల్ మోసాలను రిపోర్ట్ చేయవచ్చు