News December 29, 2024
విద్యార్థులకు శుభవార్త
AP: గురుకుల విద్యార్థులకు భీమ్ ప్రాజెక్టుతో అత్యుత్తమ వైద్యం అందిస్తామని మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్య పర్యవేక్షణకు జిల్లాకు ఒక డాక్టర్‌ను నియమించామన్నారు. సింగరాయకొండలో SC, BC వసతి గృహాలను తనిఖీ చేసి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గురుకులాల కోసం 15 రకాల పరికరాలతో హెల్త్ కిట్లు తెస్తున్నామన్నారు. ₹206 కోట్లతో 62 కొత్త హాస్టళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు.
Similar News
News January 4, 2025
సోషల్ మీడియా ఖాతాలకు కేంద్రం కొత్త రూల్!
దేశంలోని పిల్లల సోషల్ మీడియా ఖాతాలకు ఇకపై పేరెంట్స్ అనుమతి తప్పనిసరి కానుంది. ‘డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్’కు సంబంధించిన డ్రాఫ్ట్ రూల్స్‌ను కేంద్రం తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం పేరెంట్స్ అనుమతిస్తేనే పిల్లల పర్సనల్ డేటాను సంస్థలు స్టోర్ చేయవచ్చు. ఒకవేళ రూల్స్ ఉల్లంఘిస్తే ఆ కంపెనీలకు ₹250కోట్ల వరకూ ఫైన్ ఉంటుంది. దీనిపై FEB18లోగా <
News January 4, 2025
నేటి నుంచి జూ.కాలేజీల్లో మధ్యాహ్న భోజనం
AP: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో నేటి నుంచి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు కానుంది. మంత్రి నారా లోకేశ్ విజయవాడలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 475ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే 1.48లక్షల మందికి ఈ పథకంతో లబ్ధి చేకూరనుంది. దాదాపు 400కాలేజీలను సమీపంలోని స్కూళ్లకు, మిగతా వాటిని సెంట్రలైజ్డ్ కిచెన్‌లకు అటాచ్ చేయగా అక్కడ భోజనం తయారు చేసి కాలేజీలకు పంపనున్నారు.
News January 4, 2025
నాకు ఆ తెలివి ఉంది: రోహిత్
జట్టు నుంచి తప్పుకుంటే రిటైర్మెంట్ తీసుకున్నట్లు కాదని రోహిత్ శర్మ స్పష్టం చేశారు. ఓ మ్యాచ్‌కు దూరమైతే తిరిగి కమ్‌బ్యాక్ ఇవ్వలేనని అర్థం కాదు కదా అన్నారు. ఎవరో ల్యాప్‌టాప్ ముందో, పెన్ పట్టుకొని కూర్చొని తన రిటైర్మెంట్, కెప్టెన్సీ గురించి నిర్ణయించలేరని తెలిపారు. తాను సెన్సిబుల్ వ్యక్తినని, ఇద్దరు పిల్లలకు తండ్రి అయిన తనకు జీవితంలో ఎప్పుడు ఏం కావాలో నిర్ణయించుకునే తెలివి ఉందని చెప్పారు.