News December 29, 2024

ఈ ఏడాది 75 మంది ఉగ్రవాదులు హతం

image

JKలో ఈ ఏడాది 75 మంది ఉగ్ర‌వాదుల్ని భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఎన్‌కౌంట‌ర్ చేశాయి. వీరిలో 60% మంది పాక్ ఉగ్ర‌వాదులు ఉన్న‌ట్టు ఆర్మీ వెల్ల‌డించింది. ఈ ప్రాంతంలో కేవలం న‌లుగురు స్థానికుల్ని రిక్రూట్ చేయ‌డం ద్వారా భార‌త్‌పై బ‌య‌టిశ‌క్తుల్ని ఎగదోయడంలో పాక్ పాత్ర స్పష్టమవుతోంది. హ‌త‌మైన 75 మంది ఉగ్ర‌వాదుల్లో మెజారిటీ విదేశీయులే ఉన్నారు. కొంద‌రు LOC వద్ద చొర‌బ‌డేందుకు య‌త్నించ‌గా ఆర్మీ ఎన్‌కౌంట‌ర్ చేసింది.

Similar News

News January 4, 2025

గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేస్తోంది: KTR

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల పేరిట ఓటర్లను మోసం చేస్తోందని KTR విమర్శించారు. కాంగ్రెస్ గ్యారంటీలంటే స్కామ్‌లని, స్కీమ్‌లతో ఓట్లు దండుకొని ఛార్జీలు, ట్యాక్సులు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపుతోందని ఆరోపించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో RTC బస్సు టికెట్ ఛార్జీలను 15% పెంచారని, హిమాచల్ ప్రదేశ్‌లో టాయిలెట్ ట్యాక్స్ విధిస్తున్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు.

News January 4, 2025

32,438 ఉద్యోగాలు.. BIG UPDATE

image

రైల్వేలో 32,438 గ్రూప్-డి ఉద్యోగాల భర్తీలో విద్యార్హతల్లో రైల్వే బోర్డు మార్పులు చేసింది. టెన్త్/ITI/నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన జాతీయ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికెట్ ఉన్న ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్ సహా పలు పోస్టులు భర్తీ చేస్తారు. ఈ నెల 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

News January 4, 2025

సోషల్ మీడియా ఖాతాలకు కేంద్రం కొత్త రూల్!

image

దేశంలోని పిల్లల సోషల్ మీడియా ఖాతాలకు ఇకపై పేరెంట్స్ అనుమతి తప్పనిసరి కానుంది. ‘డిజిటల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్’కు సంబంధించిన డ్రాఫ్ట్ రూల్స్‌ను కేంద్రం తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం పేరెంట్స్ అనుమతిస్తేనే పిల్లల పర్సనల్ డేటాను సంస్థలు స్టోర్ చేయవచ్చు. ఒకవేళ రూల్స్ ఉల్లంఘిస్తే ఆ కంపెనీలకు ₹250కోట్ల వరకూ ఫైన్ ఉంటుంది. దీనిపై FEB18లోగా <>Mygov సైట్‌లో<<>> ప్రజలు తమ సూచనలు తెలపొచ్చని కేంద్రం పేర్కొంది.