News December 29, 2024

ఒంగోలు: జిల్లాలో వార్షిక నేర నివేదికను విడుదల 

image

జిల్లాలో గడిచిన ఆరు నెలల్లో 440 దొంగతనాలు జరిగాయని, 581 మంది మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని జిల్లా ఎస్పీ దామోదర్ తెలిపారు. ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన వార్షిక నేర నివేదికను ఆదివారం విడుదల చేశారు. గత ఆరు నెలల్లో రూ.1.7 కోట్లు చోరీ కాగా రూ. 1.4 కోట్లు రికవరీ చేసినట్లు తెలిపారు. రానున్న కొత్త ఏడాది జిల్లాను నేర రహితంగా తీర్చిదిద్దేందుకు కొత్త పోలీసింగ్‌కు శ్రీకారం చుడతామన్నారు.

Similar News

News March 1, 2026

ప్రకాశం: యువతి ఏకాంత వీడియోలతో బ్లాక్‌మెయిల్

image

వివాహిత పర్సనల్ వీడియోలు ఆమె భర్త‌, తండ్రికి పంపి బెదిరిస్తున్న మాజీ ప్రియుడిపై గుంటూరు PSలో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే.. కొరిటెపాడుకి చెందిన ఓ యువతి, ప్రకాశం (D) యువకుడు కళాశాల రోజుల్లో ప్రేమించుకున్నారు. ఆ యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీంతో మాజీ ప్రియుడు ప్రేమించే సమయంలో యువతిని ఏకాంతంగా కలిసిన వీడియోలను భర్త, తండ్రికి పంపాడు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News March 1, 2026

మార్కాపురం: ‘కళాశాలే లేదు.. పరీక్షలు మాత్రం రాస్తారు’

image

మార్కాపురంలో BED పరీక్షలు జరుగుతున్నాయి. సుమారు 10 కళాశాలలకు సంబంధించిన విద్యార్థులకు 5 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే వారు చదువుతున్న కళాశాల ఎక్కడో వారికే తెలీదు. మధ్యవర్తులు హాల్ టికెట్ ఇస్తే పరీక్ష రాస్తారు అంతే. కళాశాల భవనాలు కూడా ఉండవు కానీ అందుకు సంబంధించిన పత్రాలు మాత్రం ఉంటాయి. ఇలాంటి ఆఫర్ ఇతర రాష్ట్రాల వారికేనట. ఈ పరిస్థితి కందుకూరులోనూ ఉన్నట్లు తెలుస్తోంది.

News March 1, 2026

ఒంగోలు ప్రజాప్రతినిధులతో చర్చించిన CM

image

చంద్రబాబు నాయుడు ఒంగోలు పార్లమెంటు పరిధిలోని ప్రజా ప్రతినిధులతో శనివారం సమావేశం నిర్వహించారు. పలు అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాల గురించి చర్చించారు. ఈ సమావేశంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి, మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డోల బాల వీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవి, ఒంగోలు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు డాక్టర్ నరసింహారెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు.