News March 16, 2024
ALERT: రూ.50వేల కంటే ఎక్కువ తీసుకెళ్లకండి
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఈక్రమంలో ప్రజలు రూ.50వేల కంటే ఎక్కువ నగదును తీసుకెళ్లకూడదు. ఒకవేళ ఉంటే.. కచ్చితంగా రసీదు, ఇతర డాక్యుమెంట్స్ చూపించాల్సిందే. తనిఖీల్లో దొరికితే పోలీసులు డబ్బును సీజ్ చేస్తారు. బంగారం, వెండి వంటి ఆభరణాలు సైతం పెద్ద మొత్తంలో తీసుకెళ్లకూడదు. ఆస్పత్రి, ఇతర అత్యవసరాల కోసం డబ్బు తీసుకెళ్తే రోగి రిపోర్టులు, రసీదులను చూపించాలి.
Similar News
News January 4, 2025
త్వరగా రూ.2,250 కోట్ల బకాయిలను చెల్లించాలి: ఆస్పత్రుల సంఘం
ఎన్టీఆర్ వైద్యసేవ బకాయిలపై ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు విజయవాడలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రూ.2,250 కోట్ల బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించేలా ప్రభుత్వానికి విన్నవించాలని నిర్ణయించారు. ఆ తర్వాత తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. ఇదే విషయంపై గతంలో ఆరోగ్యమంత్రి, అధికారులను కలవగా సానుకూలంగా స్పందించారని చెప్పారు.
News January 4, 2025
అత్యధిక లాభాలొచ్చిన సినిమా.. రూ.3కోట్లకు రూ.136 కోట్లు
తెలుగు ప్రేక్షకులను మెప్పించిన మలయాళ సినిమాల్లో ‘ప్రేమలు’ ఒకటి. తన స్నేహితులతో కలిసి ఫహాద్ ఫాజిల్ నిర్మించిన ఈ చిత్రం 2024లో భారతదేశంలో అత్యంత లాభదాయకమైన మూవీగా నిలిచింది. కేవలం రూ.3కోట్లతో యువ నటీనటులతో నిర్మించిన ఈ సినిమాకు ఏకంగా రూ.136 కోట్లు వచ్చాయి. అంటే ఏకంగా 45 రెట్లు లాభం వచ్చిందన్నమాట. ‘పుష్ప-2’కు రూ.1800 కోట్లు కలెక్షన్లు వచ్చినా దానిని రూ.350 కోట్లతో నిర్మించారు.
News January 4, 2025
వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ: మంత్రి అచ్చెన్న
AP: వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలేస్తే తాము అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. గుంటూరు విజ్ఞాన్ వర్సిటీలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. అగ్రికల్చర్‌లో డ్రోన్ టెక్నాలజీని ప్రవేశపెడతామని, యాంత్రీకరణను ప్రోత్సహిస్తామని తెలిపారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. వ్యవసాయ పనిముట్లను సబ్సిడీలో రైతులకు అందిస్తామన్నారు.