News December 29, 2024

ఆత్మరక్షణ విద్యగా తైక్వాండో సాధన చేయాలి: టీజీ వెంకటేశ్

image

ప్రతి విద్యార్థి ఆత్మరక్షణ విద్యగా టైక్వాండో సాధన ప్రతిరోజు చేయాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ అన్నారు. ఆదివారం నగరంలోని ఆఫీసర్స్ క్లబ్‌లో జరిగిన జిల్లా స్థాయి తైక్వాండో ఎంపిక పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆయన బహుమతులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. తైక్వాండో లాంటి మార్షల్ ఆర్ట్స్‌లో నిరంతరం సాధన చేస్తే క్రమశిక్షణతో పాటు శారీరక అభివృద్ధి కలుగుతుందన్నారు.

Similar News

News January 4, 2025

కబళించిన మృత్యువు!

image

ఊర్లో దేవర. కొత్త దుస్తుల కోసం ఆ దంపతులు అనంతపురం జిల్లా యాడికి వెళ్లారు. సంతోషంగా తిరుగుపయణం అవగా వారి బైక్‌ను బొలెరో ఢీకొంది. ఈ విషాద ఘటనలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లికి చెందిన రాజశేఖర్ (38), సుమలత (35) మరణించారు. కొత్త దుస్తుల కోసం పాఠశాల నుంచి హుషారుగా ఇంటికి వచ్చిన పిల్లలు పూజిత, మిథిల్ తల్లిదండ్రుల శవాలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషాద ఘటనతో ఇద్దరు చిన్నారులూ అనాథలయ్యారు.

News January 4, 2025

నంద్యాల: రైలు కిందపడి వ్యక్తి సూసైడ్

image

నంద్యాల నుంచి దిగువ మెట్ట వెళ్లే మార్గంలో రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు రైల్వే పోలీసులు వెల్లడించారు. డోన్ నుంచి గుంటూరు వరకు వెళ్లే రైలులో ఓ వ్యక్తి ప్రయాణం చేశారని చెప్పారు. చలమ నుంచి దిగువమెట్ట వరకు ఉన్న రైలు మార్గంలో ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. మృతి చెందిన వ్యక్తి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదన్నారు.

News January 4, 2025

విద్యార్థులు సృజనాత్మకత కలిగి ఉండాలి: కలెక్టర్

image

విద్యార్థులు చదువును విశ్లేషణాత్మకంగా, ప్రయోగాత్మకంగా తెలుసుకుని విద్యనభ్యసిస్తే ఉన్నత స్థితిలో రాణించగలుగుతారని కలెక్టర్ జీ.రాజకుమారి అన్నారు. శుక్రవారం నంద్యాలలోని ఎస్పీజీ పాఠశాలలోని జిల్లాస్థాయి సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ఖాళీ సమయాల్లో మొబైల్ ఫోన్లకు బానిస కాకుండా మంచిగా చదువుకోవాలని కలెక్టర్ ఉద్బోధించారు.