News December 29, 2024

విషాదం.. సుమిత్ కన్నుమూత

image

మధ్యప్రదేశ్ గుణ(D) పిప్లియా గ్రామంలో బోరుబావిలో నిన్న పడిన పదేళ్ల బాలుడు సుమిత్(10) కథ విషాదాంతమైంది. కుటుంబ సభ్యుల సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు బావికి సమీపంలో గొయ్యి తీసి బాలుడ్ని బయటకు తీశారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకోవడంతో ఆస్పత్రికి తరలించారు. రాత్రంతా చల్లని వాతావరణంలో ఉండటంతో శరీర భాగాలు స్తంభించి చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది.

Similar News

News January 4, 2025

సినీ నటి సీత తల్లి కన్నుమూత

image

సీనియర్ నటి సీత తల్లి చంద్రమోహన్ (88) కన్నుమూశారు. చెన్నైలోని సాలిగ్రామంలోని తన స్వగృహంలో గుండె సంబంధిత సమస్యలతో ఆమె నిన్న తుది శ్వాస విడిచారు. చంద్రమోహన్ అసలు పేరు చంద్రావతి కాగా, పెళ్లయ్యాక ఆమె పేరును మార్చుకున్నారు. సీత పలు తెలుగు, తమిళ సినిమాలతో పాటు సీరియళ్లలో నటిస్తూ పాపులర్ అయ్యారు.

News January 4, 2025

శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం కన్నుమూత

image

భారత భౌతిక శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం (88) కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని జస్‌లోక్ ఆస్పత్రిలో ఇవాళ ఉదయం తుది శ్వాస విడిచారు. 1975, 1998 అణు పరీక్షల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. అణుశక్తి కమిషన్‌కు ఛైర్మన్‌గా, భారత ప్రభుత్వానికి శాస్త్రీయ సలహాదారునిగా పనిచేశారు. 1975లో పద్మశ్రీ, 1999లో పద్మ విభూషణ్ పురస్కారాలను అందుకున్నారు.

News January 4, 2025

రోహిత్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..

image

టెస్టుల నుంచి రిటైర్ అవ్వట్లేదని కెప్టెన్ రోహిత్ ప్రకటించడంతో హిట్‌మ్యాన్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 5వ టెస్టు ముందు రోజు నుంచి జట్టులో చోటు చేసుకున్న పరిణామాలు, మ్యాచ్‌కు దూరం కావడంతో రిటైర్ ఊహాగానాలు వ్యాప్తి చెందాయి. దీంతో రోహిత్ ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. అనుమానాలన్నింటికీ తెరదించుతూ తాను రిటైర్ అవ్వట్లేదని, ఫామ్‌లో లేని కారణంగా తాత్కాలికంగా తప్పుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.