News December 29, 2024
రాష్ట్ర ప్రభుత్వానికి బండి సంజయ్ వార్నింగ్
TG: సంక్రాంతిలోపు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రిలీజ్ చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకపోతే బీజేపీ రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో పండగ తర్వాత ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. మరోవైపు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి నెలకొనడం బాధాకరమన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట మేరకు వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు.
Similar News
News January 4, 2025
హైకోర్టులో కౌశిక్ రెడ్డి క్వాష్ పిటిషన్
TG: ఎన్నికల సమయంలో ‘గెలిపిస్తే విజయయాత్ర లేదంటే మా కుటుంబ శవయాత్ర’ అంటూ తాను చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసును కొట్టేయాలని కోరుతూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ పీఎస్‌లో ఆయనపై కేసు నమోదైంది. తాను అమాయకుడినని, తనపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగా కేసు నమోదు చేశారని కౌశిక్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
News January 4, 2025
నేడు నేవీ విన్యాసాలు
AP: విశాఖ ఆర్కే బీచ్‌లో నేడు నేవీ సాహస విన్యాసాల(ఆపరేషన్ డెమో)ను ప్రదర్శించనుంది. దీనికి సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఏటా డిసెంబర్ 4న నేవీ డే నిర్వహించి అదేరోజు సాహస విన్యాసాలను ప్రదర్శిస్తుంటారు. అయితే ఈసారి(2024 DEC) ఒడిశాలో నేవీ డే నిర్వహించగా విశాఖ ప్రజల కోసం ఇవాళ సాయంత్రం ప్రదర్శన చేపట్టనున్నారు. చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌తోపాటు వారి కుటుంబసభ్యులు సైతం హాజరుకానున్నారు.
News January 4, 2025
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేస్తోంది: KTR
TG: కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల పేరిట ఓటర్లను మోసం చేస్తోందని KTR విమర్శించారు. కాంగ్రెస్ గ్యారంటీలంటే స్కామ్‌లని, స్కీమ్‌లతో ఓట్లు దండుకొని ఛార్జీలు, ట్యాక్సులు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపుతోందని ఆరోపించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో RTC బస్సు టికెట్ ఛార్జీలను 15% పెంచారని, హిమాచల్ ప్రదేశ్‌లో టాయిలెట్ ట్యాక్స్ విధిస్తున్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు.