News March 16, 2024

రేపు గ్రూప్-1 పరీక్ష.. కేంద్రాల వద్ద 144 సెక్షన్: సీఎస్

image

AP: రాష్ట్రంలో 81 గ్రూప్-1 పోస్టులకు రేపు జరిగే ప్రిలిమ్స్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు సీఎస్ జవహర్‌రెడ్డి వెల్లడించారు. 301 కేంద్రాల్లో ఉ.10 నుంచి మ.12 వరకు పేపర్-1, మ.2 నుంచి 4 గంటల వరకు పేపర్-2 ఎగ్జామ్ జరుగుతుందన్నారు. 1.48 లక్షల మంది అభ్యర్థులు హాజరవుతారని చెప్పారు. పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పర్యవేక్షణకు ప్రతి జిల్లాకు ఓ ఐఏఎస్‌ను నియమించామని పేర్కొన్నారు.

Similar News

News April 3, 2025

పాయింట్స్ టేబుల్ టాప్‌లో పంజాబ్ కింగ్స్

image

ఐపీఎల్ 2025లో రెండు వరుస విజయాలు సాధించి పాయింట్ల పట్టికల పంజాబ్ కింగ్స్ టాప్‌లో నిలిచింది. ఢిల్లీ కూడా ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి ఎరగకుండా రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు టాప్‌లో ఉన్న ఆర్సీబీ.. గుజరాత్‌పై ఓటమితో మూడో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాత GT, MI, LSG, CSK, SRH, RR, KKR కొనసాగుతున్నాయి. ఇవాళ జరిగే SRH vs KKR మ్యాచ్ తర్వాత సమీకరణాలు మారే ఛాన్స్ ఉంది.

News April 3, 2025

ముస్లింలను అణచివేసేందుకే వక్ఫ్ బిల్లు: రాహుల్

image

దేశంలోని ముస్లింలను అణచివేసి, వారి ఆస్తి హక్కులను హరించేందుకు వక్ఫ్ బిల్లును ఓ ఆయుధంగా వాడుకుంటున్నారని ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘ముస్లింలను లక్ష్యంగా చేసుకునే వక్ఫ్ బిల్లు తీసుకొచ్చారు. భవిష్యత్‌లో దీనిని ఇతర వర్గాలపై కూడా ప్రయోగించవచ్చు. ఈ బిల్లు ఆర్టికల్ 25ను ఉల్లంఘిస్తుంది. ఇది దేశ ఆలోచనలపై దాడి చేస్తుంది’ అని ఆయన ఎక్స్‌లో తీవ్ర విమర్శలు చేశారు.

News April 3, 2025

ఆల్‌టైమ్ రికార్డును సమం చేసిన భువీ

image

RCB స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ ఆల్‌టైమ్ రికార్డును సమం చేశారు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా ఘనత సాధించారు. ఇప్పటివరకు ఆయన 183 వికెట్లు తీసి డ్వేన్ బ్రావో రికార్డును భువీ సమం చేశారు. గుజరాత్‌తో జరిగిన మ్యాచులో స్వింగ్ కింగ్ ఈ ఫీట్ సాధించారు. అలాగే IPL చరిత్రలో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గానూ ఆయన కొనసాగుతున్నారు. టోర్నీ పవర్ ప్లేలో ఇప్పటివరకు 73 వికెట్లు పడగొట్టారు.

error: Content is protected !!