News December 29, 2024

రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన ఉమ్మడి ADBజట్టు

image

హన్మకొండలో జరుగుతున్న రాష్ట్రస్థాయి CMకప్ హ్యాండ్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలికలజట్టు ఫైనల్స్ లో ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్ సాధించింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో వరంగల్ జట్టుతో తలపడి 12గోల్స్ ఆధిక్యంలో జిల్లా జట్టు విజయం సాధించింది. జిల్లా క్రీడాకారులు,కోచ్ అరవింద్ ను ఉమ్మడి జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్ష,ప్రధానకార్యదర్శులు శ్యాంసుందర్ రావు,కనపర్తి రమేష్,పలువురు అభినందించారు.

Similar News

News January 4, 2025

భీంపూర్: 3 ఆవులను చంపిన పెద్దపులి

image

పెద్దపులి దాడిలో 3 ఆవులు మృతి చెందిన ఘటన భీంపూర్‌లో చోటుచేసుకుంది. మండలంలోని పిప్పల్ కోటి గ్రామ శివారులో ఉన్న పంట పొలాల్లో శుక్రవారం మేతకు వెళ్లిన 3 ఆవులపై పులి దాడి చేసి చంపేయగా మరో 3 తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. దీంతో రైతులు పంట చేలకు వెళ్లాలంటే జంకుతున్నారు.

News January 4, 2025

మందమర్రి: రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

image

మందమర్రి మండలం పులిమడుగు ఫ్లై ఓవర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్సై రాజశేఖర్ కథనం ప్రకారం.. మంచిర్యాల ర్యాలీగడ్‌పూర్‌కు చెందిన రాజు(24) భీమిని మండలంలోని భీంపూర్ గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. ప్రమాదం చోటు చేసుకొని చనిపోయినట్లు చెప్పారు.

News January 4, 2025

క్రీడాకారులను అభినందించిన ADB కలెక్టర్

image

సీఎం కప్ రాష్ట్ర స్థాయిలో పోటీల్లో రాణించిన క్రీడాకారులను ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజార్షిషా అభినందించారు. వివిధ ఆటల్లో జిల్లా క్రీడాకారులు పాల్గొని 43 మెడల్స్ సాధించి విజేతలుగా నిలిచారు. ఈ సందర్భంగా గెలుపొందిన క్రీడాకారులను శుక్రవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో కలెక్టర్ అభినందించారు. మెడల్స్, ప్రశాంత పత్రాలు అందజేశారు. డీవైఎస్ఓ వెంకటేశ్వర్లు, గిరిజన క్రీడల అధికారి పార్థసారథి తదితరులు ఉన్నారు.