News December 29, 2024

కాకినాడ: తాబేళ్ల మరణంపై విచారణకు ఆదేశించిన Dy.CM 

image

కాకినాడ బీచ్ రోడ్, APIIC వాకలపూడి ప్రాంతాల్లో అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్లు అత్యధిక సంఖ్యలో మరణిస్తున్న విషయం డిప్యూటీ సీఎం Pawan Kalyan దృష్టికి వచ్చింది. రిడ్లీ తాబేళ్ల మరణానికి కారణాలు విచారించి, దీనికి కారణమైన వారిపై చర్యలు చేపట్టాలని, వన్యప్రాణుల పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ చిరంజీవి చౌదరిని ఆయన ఆదేశించారు.

Similar News

News August 18, 2025

కేంద్రమంత్రిని మంత్రిని కలిసిన మినిస్టర్ దుర్గేశ్

image

న్యూఢిల్లీలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను మంత్రి కందుల దుర్గేశ్
సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పర్యాటకం అభివృద్ధిపై చర్చించారు. లేపాక్షిలో కల్చరల్ సెంటర్ రూ.103కోట్లు, లంబసింగిలో ఎక్స్పీరియన్స్ సెంటర్ & టూరిజం అభివృద్ధి రూ.99.87 కోట్లు, బుద్ధిస్ట్ సర్క్యూట్ ప్రాజెక్టుల డీపీఆర్‌ను మంత్రికి సమర్పించారు.

News August 18, 2025

తూర్పు గోదావరి జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు

image

భారీ వర్షాల నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికలు, నిరంతరంగా కురుస్తున్న వర్షాల కారణంగా ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు చేపట్టారు. ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.

News August 17, 2025

తూ.గో: రేపు యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS కార్యక్రమం సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ పి.ప్రశాంతి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మ.1 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. సమస్య పరిష్కారం కోసం ప్రజలు తమ అర్జీలను అందజేయొచ్చన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు పాల్గొనాలని ఆదేశించారు. వాట్సాప్ గవర్నెన్స్ గూర్చి అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు.