News December 29, 2024
6 విమాన ప్రమాదాలు.. 234 మంది మృతి
ప్రపంచ ఏవియేషన్ రంగానికి డిసెంబర్ తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ నెలలో పలు దేశాల్లో జరిగిన ప్రమాదాల్లో 234 మంది ప్రయాణికులు మృతి చెందారు. అదివారం దక్షిణ కొరియాలో జరిగిన ఒక్క ఘటనలోనే 177 మంది మృతి చెందారు. అంతకుముందు అజర్ బైజాన్ విమానం కజకిస్థాన్‌లో అనుమానాస్పద రీతిలో ప్రమాదానికి గురైన ఉదంతంలో 38 మంది అసువులు బాశారు. మరో 4 చోట్ల 19 మంది మృతి చెందడం సాంకేతిక సమస్యలపై ఆందోళన కలిగిస్తోంది.
Similar News
News January 4, 2025
ఇండియాలో తొలి బీటా బేబీ ఎవరంటే?
ఈ ఏడాది నుంచి కొత్త జనరేషన్ ప్రారంభమైంది. దీనిని జనరేషన్ బీటాగా పిలుస్తున్నారు. 2025-2039 మధ్య జన్మించే పిల్లలను జనరేషన్ బీటాగా పరిగణిస్తారు. మన దేశంలో తొలి బీటా శిశువు మిజోరం రాష్ట్రంలో జన్మించాడు. అతనికి ఫ్రాంకీ రెమ్రువాత్‌డికా జాడెంగ్ అని పేరు పెట్టారు. జనవరి 1న రాత్రి 12.03కు ఆ బాబుకు రామ్జీర్‌మావీ, జెడ్‌డీ రెమ్రువాత్‌సంగా దంపతులు జన్మనిచ్చారు.
News January 4, 2025
ట్రంప్‌నకు శిక్ష.. అనుభవించాల్సిన అవసరం లేదు!
హష్ మనీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డొనాల్డ్ ట్రంప్‌నకు శిక్ష విధిస్తానంటూ, కానీ అనుభవించాల్సిన అవసరం లేదని న్యూయార్క్ జడ్జి జ్యుయన్ మర్చన్ తన తీర్పులో తెలిపారు. ప్రొబెషన్‌తో పాటు జరిమానా కూడా చెల్లించకుండా ‘అన్‌కండిషనల్ డిశ్చార్జ్’ అమలు చేస్తామన్నారు. శిక్ష విధించే JAN 10న వ్యక్తిగతంగా లేదా వర్చువల్‌గా కోర్టుకు హాజరుకావాలని చెప్పారు. ఈ నెల 20న ట్రంప్ US అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
News January 4, 2025
కుంభమేళాకు ఉగ్రముప్పు
యూపీలోని ప్రయాగరాజ్‌లో జరిగే కుంభమేళాకు ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు నిఘా వర్గాలు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశాయి. ఉగ్రమూకలు సాధువుల రూపంలో దాడులకు తెగబడే ప్రమాదం ఉందని హెచ్చరించడంతో యూపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి భక్తుల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.