News December 29, 2024

విచారణకు పవన్ ఆదేశం.. రంగంలోకి అధికారులు

image

AP: కాకినాడ వాకలపూడి తీరంలో ఆలివ్ రిడ్లే తాబేళ్లు మరణిస్తుండటంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని అధికారులకు సూచించారు. తాబేళ్ల మృతికి గల కారణాలను తెలుసుకోవాలని, కారకులపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అలాగే కాకినాడ తీరంలో దుర్గంధం వెదజల్లుతున్న పరిశ్రమల్లో తనిఖీలు చేయాలని PCB అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు రంగంలోకి దిగారు.

Similar News

News January 4, 2025

ట్రంప్‌నకు శిక్ష.. అనుభవించాల్సిన అవసరం లేదు!

image

హష్ మనీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డొనాల్డ్ ట్రంప్‌నకు శిక్ష విధిస్తానంటూ, కానీ అనుభవించాల్సిన అవసరం లేదని న్యూయార్క్ జడ్జి జ్యుయన్ మర్చన్ తన తీర్పులో తెలిపారు. ప్రొబెషన్‌తో పాటు జరిమానా కూడా చెల్లించకుండా ‘అన్‌కండిషనల్ డిశ్చార్జ్’ అమలు చేస్తామన్నారు. శిక్ష విధించే JAN 10న వ్యక్తిగతంగా లేదా వర్చువల్‌గా కోర్టుకు హాజరుకావాలని చెప్పారు. ఈ నెల 20న ట్రంప్ US అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

News January 4, 2025

కుంభమేళాకు ఉగ్రముప్పు

image

యూపీలోని ప్రయాగరాజ్‌లో జరిగే కుంభమేళాకు ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు నిఘా వర్గాలు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశాయి. ఉగ్రమూకలు సాధువుల రూపంలో దాడులకు తెగబడే ప్రమాదం ఉందని హెచ్చరించడంతో యూపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి భక్తుల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

News January 4, 2025

BREAKING: తగ్గిన బంగారం ధర

image

గత రెండ్రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.490 తగ్గి రూ.78,710 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 తగ్గి రూ.72,150గా ఉంది. అటు వెండి ధర కేజీపై రూ.1000 తగ్గి రూ.99,000 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.