News December 29, 2024
ప.గో: ‘237 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు జరిగాయి’
ప.గో.జిల్లాలో ఇప్పటివరకు 237 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహించామని, భూసమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. జిల్లాలో రెవెన్యూ సదస్సుల నిర్వహణ ద్వారా ప్రజల నుంచి భూ సంబంధ, రెవెన్యూ శాఖల పరంగా మ్యుటేషన్, కుటుంబ సభ్యుల ధ్రువపత్రాలు, పట్టాదారు పాసు పుస్తకాలు తదితర సమస్యలు పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.
Similar News
News January 4, 2025
జగన్ మోసం చేశారు: నిమ్మల
పోలవరం నిర్వాసితులకు 2017లోనే చంద్రబాబు రూ.800 కోట్లు విడుదల చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లు పరిధిలోని 6 గ్రామాల్లో రూ.3 కోట్లతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వంలో పోలవరం నిర్వాసితులకు రూ.10 లక్షల వరకు ఇస్తామని చెప్పి జగన్ మోసం చేశారు. తాజాగా మేము ఒకేరోజు నిర్వాసితులకు రూ.815 కోట్లు చెల్లించాం’ అని నిమ్మల అన్నారు.
News January 4, 2025
కాకి, నెమలి, డేగ.. ఇంకేమున్నాయి..?
సంక్రాంతి సందడంతా ప.గో జిల్లాలోనే ఉంటోంది. కోడిపందేలు, కొత్త అల్లుళ్లకు మర్యాదలు చాలానే ఉంటాయి. ప్రత్యేకించి కోడిపందేల కోసం ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి భీమవరానికి వస్తుంటారు. రూ.కోట్లలో పందేలు కాస్తారు. కాకి, డేగ, తీతువ, కాకిడేగ, రసంగి, అబ్రాస్, కెక్కిరాయి, కోడికాకి, కోడి పింగళ, నెమలి అంటూ ఏ రోజు ఏది గెలుస్తోందో కొందరు ముందే జోస్యం చెప్పేస్తుంటారు. మీకు తెలిసిన కోళ్ల పేర్లు కామెంట్ చేయండి.
News January 4, 2025
1,123 ఎకరాల్లో తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్ట్..!
ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి రాజమండ్రిలో ఓ ఎయిర్‌పోర్ట్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప.గో జిల్లాలోనూ విమానాశ్రయం రానుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. తాడేపల్లిగూడెంలో ఎయిర్‌పోర్ట్ నిర్మించాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి ఉందన్నారు. దాదాపు 1,123 ఎకరాల్లో ఎయిర్‌పోర్ట్ నిర్మించేలా ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. అన్నీ కుదిరితే త్వరలోనే ఎయిర్‌పోర్టు పనులపై ముందడుగు పడే అవకాశం ఉంది.