News December 29, 2024

రోహిత్ రిటైర్ కావడం మంచిది: ఆసీస్ మాజీ కెప్టెన్

image

టెస్టుల్లో విఫలమవుతున్న టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇక రిటైర్ కావడం మంచిదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మార్క్ వా అన్నారు. తాను కనుక సెలక్టర్ అయితే మెల్‌బోర్న్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో విఫలమైతే రోహిత్‌కు ఉద్వాసన పలుకుతానని చెప్పారు. ‘రోహిత్ చివరి 14 ఇన్నింగ్సుల్లో యావరేజ్ 11 మాత్రమే. ఇది ఆయన వైఫల్యానికి నిదర్శనం. ఎవరైనా ఏదో ఒకదశలో కెరీర్ చరమాంకానికి చేరుకోక తప్పదు’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News January 4, 2025

కుంభమేళాకు ఉగ్రముప్పు

image

యూపీలోని ప్రయాగరాజ్‌లో జరిగే కుంభమేళాకు ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు నిఘా వర్గాలు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశాయి. ఉగ్రమూకలు సాధువుల రూపంలో దాడులకు తెగబడే ప్రమాదం ఉందని హెచ్చరించడంతో యూపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి భక్తుల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

News January 4, 2025

BREAKING: తగ్గిన బంగారం ధర

image

గత రెండ్రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.490 తగ్గి రూ.78,710 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.450 తగ్గి రూ.72,150గా ఉంది. అటు వెండి ధర కేజీపై రూ.1000 తగ్గి రూ.99,000 పలుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

News January 4, 2025

రోహిత్.. హ్యాట్సాఫ్: మంజ్రేకర్

image

రోహిత్ శర్మ తాను ఫామ్‌లో లేనని ఒప్పుకోవడాన్ని కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కొనియాడారు. ‘హ్యాట్సాఫ్ రోహిత్. మరీ ఎక్కువమంది ఫామ్ లేని ఆటగాళ్లు సిడ్నీ టెస్టులో ఆడటం మంచిది కాదని తాను తప్పుకున్నానన్నారు. ఇంటర్వ్యూలో అత్యంత నిజాయితీతో మాట్లాడారు’ అని ట్వీట్ చేశారు. కాగా.. తనకు రిటైర్మెంట్ ఆలోచన లేదని, ఈ మ్యాచ్‌కు మాత్రం తానే తప్పుకొన్నానని రోహిత్ ఇంటర్వ్యూలో తెలిపిన సంగతి తెలిసిందే.