News December 29, 2024

నూర్పిడి యంత్రం బోల్తా.. బాలుడి మృతి

image

బొబ్బిలి మండలంలోని మహారాణితోట సమీపంలో ఉన్న పొలంలో నూర్పిడి యంత్రం బోల్తాపడి సాలపు మణికంఠ(14) మృతి చెందారు. బాలుడు తల్లిదండ్రులు శంకర్, పొలమ్మ నూర్పిడి కూలీ పనికి వెళ్లగా తల్లిదండ్రులతో ఇద్దరు కుమారులు వెళ్లారు. నూర్పిడి అయిపోవడంతో యంత్రంపైకి ఎక్కవద్దని తల్లిదండ్రులు చెప్పినప్పటికి వినకుండా మణికంఠ, తమ్ముడు పార్థు, మరో అబ్బాయి ఎక్కారు. బోల్తా పడడంతో ఇద్దరు దూరంగా తుల్లగా మణికంఠ కిందపడి మరణించాడు.

Similar News

News January 4, 2025

VZM: కానిస్టేబుల్ ఉద్యోగాలు.. 236 మంది గైర్హాజరు..!

image

విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మహిళ కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది . మొత్తం 550 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 314 మంది అభ్యర్థులు మాత్రమే PMT, PET పరీక్షలకు హాజరయ్యారు. 236 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కాగా ఎంపిక ప్రక్రియ శుక్రవారం ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు జరిగింది.

News January 4, 2025

మార్చి 8న జాతీయ లోక్ అదాలత్: జిల్లా జడ్జి

image

మార్చి 8న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి పిలుపునిచ్చారు. శుక్రవారం తన ఛాంబర్ లోని పలు ప్రైవేట్ చిట్ ఫండ్ ఫైనాన్స్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఫైనాన్స్ కంపెనీకి చెందిన కేసులన్నీ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవాలని సూచించారు. ఎక్కువ కేసులు రాజీ చేసుకునే ప్రయత్నం చేయాలన్నారు.

News January 3, 2025

VZM: చిన్నారిపై అత్యాచారం కేసులో 25 ఏళ్ల జైలుశిక్ష

image

విజయనగరం జిల్లాలో సంచలనం రేపిన చిన్నారిపై అత్యాచారం కేసులో నిందితుడికి 25ఏళ్లు జైలుశిక్ష విధిస్తూ జిల్లా ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నాగమణి తీర్పు ఇచ్చినట్లు DSP శ్రీనివాసరావు చెప్పారు. రామభద్రపురం మండలం నేరేళ్లవలసలో బి.ఎరకన్నదొర గతేడాది ఉయ్యాలలో ఉన్న బాలికపై అత్యాచారం చేశాడు. జైలుశిక్ష పడడంతో ప్రజలు, ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జైలుశిక్షతో పాటు రూ.5వేలు జరిమానా విధించారు.