News December 29, 2024

ALERT.. రేపు, ఎల్లుండి జాగ్రత్త

image

తెలంగాణలో రానున్న 5 రోజులు ఉదయం వేళ పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వెల్లడించింది. రేపు 17-30 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. రేపు, ఎల్లుండి సంగారెడ్డి, మెదక్, వికారాబాద్ జిల్లాల్లో 11-15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఎల్లో అలర్ట్ ఇచ్చింది.

Similar News

News March 26, 2026

40 మంది ప్రయాణికులతో నదిలోకి దూసుకెళ్లిన బస్సు

image

బంగ్లాదేశ్‌లోని దౌలదియా టెర్మినల్ దగ్గర 40 మంది ప్రయాణికులతో ఉన్న బస్సు, ఫెర్రీ ఎక్కుతుండగా అదుపుతప్పి పద్మా నదిలో పడిపోయింది. పడవ ఢీకొనడంతో డ్రైవర్ స్టీరింగ్ కంట్రోల్ కోల్పోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. కొంతమంది ఈదుకుంటూ బయటపడినా చాలామంది గల్లంతయ్యారు. డైవర్లు, రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. ఢాకా నుంచి కూడా ప్రత్యేక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.

News March 26, 2026

డోర్నకల్-గద్వాల రైల్వే లైన్ సర్వే పూర్తి: అశ్వినీ వైష్ణవ్

image

డోర్నకల్-గద్వాల మధ్య 296 km కొత్త రైల్వే లైన్ సర్వే పూర్తయిందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ లైన్ సూర్యాపేట, నల్గొండ మీదుగా సాగుతుంది. DPR తర్వాత దీనికి క్లియరెన్స్ లభిస్తుంది. అయితే జడ్చర్ల-నంద్యాల లైన్‌లో ట్రాఫిక్ తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రంలో భూసేకరణ జాప్యం వల్ల కొన్ని ప్రాజెక్టులు ఆలస్యమవుతున్నా ఇప్పటివరకు 67% ల్యాండ్ సేకరించారు.

News March 26, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.