News December 30, 2024
ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రైమ్ న్యూస్

> MLG: విద్యుత్ షాకుతో రైతు మృతి..
> MHBD: కొమ్ములవంచలో పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య..
> WGL: తిమ్మంపేట లో గుట్కా ప్యాకెట్లు పట్టివేత..
> JN: డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన
> WGL: తల్లి, కూతురు సూసైడ్ అటెంప్ట్
> MLG: అడవి పంది, అడవి కోడిని వేటాడిన వ్యక్తులపై కేసు
> WGL: ధర్మారంలో గుర్తుతెలియని మృతదేహం
Similar News
News January 13, 2026
వరంగల్: రాజకీయ నాయకుల్లో సంక్రాంతి సంబరం..!

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ముందే సంక్రాంతి పండుగ రావడంతో నర్సంపేట, వర్ధన్నపేట పట్టణాల్లో రాజకీయ వేడి పెరిగింది. నేతలు ఓటర్ల తుది జాబితా పూర్తవడంతో రిజర్వేషన్లపై లెక్కలు వేసుకుంటూ తమ వైపు ప్రజలను తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పండగకు ఊరికి వచ్చిన వారిని ఆత్మీయంగా పలకరిస్తూ, మూడు రోజుల పాటు మద్దతు కూడగట్టే పనిలో నేతలు బిజీగా ఉన్నారు. అన్ని పార్టీల్లోనూ ఇదే ఉత్సాహం కనిపిస్తోంది.
News January 12, 2026
ప్రజావాణిలో 129 వినతులు స్వీకరణ: వరంగల్ కలెక్టర్

వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సత్య శారద హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌వో విజయలక్ష్మి, ఆర్డీవోలు సుమ, ఉమారాణి పాల్గొన్నారు. మొత్తం 129 దరఖాస్తులు అందగా వాటిలో రెవెన్యూ సంబంధిత 52 ఉన్నాయి. భూ సమస్యలు, పింఛన్లు, గృహాలు, సంక్షేమ పథకాలపై వచ్చిన వినతులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.
News January 12, 2026
వరంగల్: విద్యా సంస్థల నిర్మాణం వేగవంతం చేయాలి: భట్టి

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యా సంస్థల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని Dy.సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో వరంగల్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ సత్య శారద పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని విద్యార్థులను ప్రపంచ స్థాయి పోటీల్లో ముందు వరుసలో నిలబెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు.


