News December 30, 2024

AP సీఎస్‌గా విజయానంద్ ఖరారు

image

AP కొత్త సీఎస్‌గా విజయానంద్ పేరు ఖరారైంది. ఆయన్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ నీరభ్ కుమార్ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుండటంతో ప్రభుత్వం కొత్త సీఎస్‌ను నియమించింది. కాగా 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి అయిన విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.

Similar News

News January 4, 2025

SBI నుంచి 2 కొత్త డిపాజిట్ స్కీమ్‌లు

image

SBI రెండు కొత్త డిపాజిట్ పథకాలను ప్రారంభించింది. హర్ ఘర్ లఖ్‌పతీ స్కీమ్‌లో రూ.లక్ష చొప్పున(రూ.లక్ష మల్టిపుల్స్) పోగేసుకోవచ్చని SBI తెలిపింది. ఈ ప్రీకాలిక్యులేటెడ్ రికరింగ్ డిపాజిట్ కనీస కాలవ్యవధి 12నెలలు కాగా, గరిష్ఠ వ్యవధి 120 నెలలు. అటు, 80ఏళ్ల పైబడిన వారి కోసం తీసుకొచ్చిన SBI ప్యాట్రన్స్ స్కీమ్‌లో సీనియర్ సిటిజన్లకు ఇచ్చే వడ్డీ కంటే 10బేస్ పాయింట్లు అదనంగా చెల్లించనున్నట్లు వెల్లడించింది.

News January 4, 2025

ఆకలి తీర్చేందుకు ఫొటోలు, వీడియోలెందుకు?

image

ఆకలితో ఉన్న అనామకుల కడుపు నింపేందుకు ఎంతోమంది ఆహారాన్ని డొనేట్ చేస్తుంటారు. అయితే, ఇదంతా వీడియోలు, ఫొటోలు తీస్తుండటంతో కొందరు ఇబ్బందికి గురై ఫుడ్ తీసుకునేందుకు ముందుకురారు. అలాంటి ఇబ్బందులు లేకుండా జర్మనీలోని కొన్ని ప్రాంతాల్లో ఆహార పొట్లాలను వీధుల్లో తగిలిస్తుంటారు. అవసరం ఉన్నవారు వాటితో కడుపు నింపుకుంటారు. ఈ చిన్నపాటి చొరవతో ఎలాంటి హడావుడి లేకుండా ఎంతో మంది ఆకలి తీరుతోంది.

News January 4, 2025

శ్రీవారి భక్తులకు TTD ఛైర్మన్ విజ్ఞప్తి

image

AP: వైకుంఠ ఏకాదశి టోకెన్లు జారీ చేయనున్న కేంద్రాల్లో ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయని TTD ఛైర్మన్ BR నాయుడు తెలిపారు. జనవరి 10-19 వరకు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంటాయని.. 10,11,12వ తేదీల్లోనే స్వామిని దర్శించుకోవాలని అనుకోవద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. టోకెన్లను తీసుకోవాలన్న ఆత్రుతలో తోసుకోవద్దని సూచించారు. VIPలకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని, సామాన్య భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.