News December 30, 2024
మంత్రి అచ్చెన్నాయుడు గొప్ప మనసు
AP: న్యూఇయర్ వేడుకల సందర్భంగా తనను కలిసే అభిమానులు బొకేలు, పూలదండలు, శాలువాలు తీసుకురావద్దని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. వాటికి బదులు పుస్తకాలు, పెన్నులు తీసుకురావాలని ఆయన కోరారు. తనకు అభిమానులు నిండు మనసుతో చెప్పే శుభాకాంక్షలు చాలని పేర్కొన్నారు. పెన్నులు, పుస్తకాలు ఇస్తే పేద విద్యార్థులకు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ విధంగానైనా పేదలను ఆదుకోవచ్చని పేర్కొన్నారు.
Similar News
News January 4, 2025
బుమ్రా బౌలింగ్‌పై రేపు నిర్ణయం!
మ్యాచ్ మధ్యలో బుమ్రా స్కానింగ్‌కి వెళ్లడంపై ఫ్యాన్స్‌లో ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. అతను వెన్నునొప్పితో బాధపడుతున్నారని, మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తున్నట్లు ప్రసిద్ధ్ కృష్ణ తెలిపారు. స్కానింగ్ తర్వాత బుమ్రా పరిగెత్తుతూ మెట్లెక్కి డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లడం చూస్తే పెద్దగాయం కాలేదని తెలుస్తోంది. 2వ ఇన్నింగ్స్‌లో బుమ్రా బ్యాటింగ్ చేస్తారని, బౌలింగ్‌పై రేపు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
News January 4, 2025
త్వరగా రూ.2,250 కోట్ల బకాయిలను చెల్లించాలి: ఆస్పత్రుల సంఘం
ఎన్టీఆర్ వైద్యసేవ బకాయిలపై ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు విజయవాడలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రూ.2,250 కోట్ల బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించేలా ప్రభుత్వానికి విన్నవించాలని నిర్ణయించారు. ఆ తర్వాత తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు. ఇదే విషయంపై గతంలో ఆరోగ్యమంత్రి, అధికారులను కలవగా సానుకూలంగా స్పందించారని చెప్పారు.
News January 4, 2025
అత్యధిక లాభాలొచ్చిన సినిమా.. రూ.3కోట్లకు రూ.136 కోట్లు
తెలుగు ప్రేక్షకులను మెప్పించిన మలయాళ సినిమాల్లో ‘ప్రేమలు’ ఒకటి. తన స్నేహితులతో కలిసి ఫహాద్ ఫాజిల్ నిర్మించిన ఈ చిత్రం 2024లో భారతదేశంలో అత్యంత లాభదాయకమైన మూవీగా నిలిచింది. కేవలం రూ.3కోట్లతో యువ నటీనటులతో నిర్మించిన ఈ సినిమాకు ఏకంగా రూ.136 కోట్లు వచ్చాయి. అంటే ఏకంగా 45 రెట్లు లాభం వచ్చిందన్నమాట. ‘పుష్ప-2’కు రూ.1800 కోట్లు కలెక్షన్లు వచ్చినా దానిని రూ.350 కోట్లతో నిర్మించారు.