News December 30, 2024
HMDA పరిధిలో 3,532 చెరువులు
HMDA పరిధిలో మొత్తం 3,532 చెరువులు ఉండగా.. 3,498 చెరువుల సర్వే పూర్తయింది. ఇంకా 34 చెరువుల సర్వే జరగాల్సి ఉంది. ప్రాథమిక నోటిఫికేషన్ మాత్రం 2,836 చెరువులకు మాత్రమే వెలువరించినట్లు అధికారులు తెలిపారు. ఫైనల్ నోటిఫికేషన్ వేసిన చెరువుల సంఖ్య 464 ఉన్నట్లుగా పేర్కొన్నారు. కొన్ని దశాబ్దాల నాటి రికార్డులను పరిశీలిస్తున్నారు.
Similar News
News February 5, 2025
గొంగడి త్రిషకు HCA నజరానా
మహిళల అండర్-19 టీ20 ప్రపంచ కప్‌లో సత్తా చాటిన క్రికెటర్ గొంగడి త్రిషకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నజరానా ప్రకటించింది. త్రిషకు రూ.10 లక్షలు, ఆమె హెడ్ కోచ్‌కు రూ.5 లక్షలు, ట్రైనర్ శాలినికి రూ.5 లక్షల నజరానా ప్రకటించింది. మరోవైపు ఆమెకు సీఎం రేవంత్ రూ.కోటి నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే.
News February 5, 2025
HYD: బాలికతో అసభ్య ప్రవర్తన.. వ్యక్తికి ఏడాది జైలు శిక్ష
బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కిరణ్ అనే యువకుడికి ఎల్బీనగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్డు ఏడాది జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించింది. పోలీసుల వివరాలిలా.. సరూర్ నగర్ పరిధికి చెందిన కిరణ్ ఓ బాలికతో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో వేధించాడు. ఈ ఘటన 2020లో జరగ్గా కేసు నమోదైంది. తాజాగా కోర్టు శిక్ష విధించింది.
News February 5, 2025
త్రిషకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండర్-19 మహిళల వరల్డ్ కప్‌లో రాణించిన క్రికెటర్ గొంగడి త్రిషకు రూ. 1 కోటి, ధృతి కేసరికి రూ. 10 లక్షలు, హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి తలా రూ. 10 లక్షలు నజరానా ప్రకటించారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం త్రిషను సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.