News December 30, 2024
శుభ ముహూర్తం (30-12-2024)
✒ తిథి: అమావాస్య తె.4:04 వరకు
✒ నక్షత్రం: మూల రా.12.35 వరకు
✒ శుభ సమయం: లేవు
✒ రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
✒ యమగండం: ఉ.10.30 నుంచి 12.00 వరకు
✒ దుర్ముహూర్తం: మ.12.24 నుంచి 1.12 వరకు. తిరిగి మ. 2.46 నుంచి 3.34 వరకు
✒ వర్జ్యం: రా. 10.55 నుంచి 12.34 వరకు
✒ అమృత ఘడియలు: సా. 5.54 నుంచి 7.33 వరకు
Similar News
News January 4, 2025
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ కన్నుమూత
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు, జపాన్ మహిళ టోమికో ఇటూకా(116) కన్నుమూశారు. 2019 నుంచి ఈమెను ఒసాకా సిటీలోని నర్సింగ్ హోమ్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. ఆరోగ్యం విషమించడంతో DEC 29న మరణించినట్లు అధికారులు ప్రకటించారు. 1908 మే23న ఒసాకాలో జన్మించిన ఈమెకు నలుగురు పిల్లలు, ఐదుగురు మనవళ్లు ఉన్నారు. స్పెయిన్‌కు చెందిన మరియా(117) గత ఏడాది మరణించడంతో ఇటూకా ఓల్డెస్ట్ మహిళగా గుర్తింపు పొందారు.
News January 4, 2025
బెయిల్ పూచీకత్తు పత్రాలు సమర్పించిన బన్నీ
TG: పుష్ప-2 హీరో అల్లుఅర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. జడ్జి ముందు రెగ్యులర్ బెయిల్ పూచీకత్తు పత్రాలు సమర్పించారు. వాటిపై సంతకాలు చేశారు. అనంతరం తన ఇంటికి వెళ్లిపోయారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు నిన్న రూ.50వేల చొప్పున 2 పూచీకత్తులతో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
News January 4, 2025
AI చాట్‌బాట్‌లతో ఈ వివరాలు చెప్పొద్దు/అడగొద్దు!
ChatGPT, AI చాట్ బాట్‌లతో వ్యక్తిగత వివరాలు షేర్ చేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత రహస్యాలు, ఫైనాన్సియల్ ఇన్ఫో వంటివి షేర్ చేయొద్దంటున్నారు. వీటి నుంచి మెడికల్ అడ్వైస్‌లు తీసుకుని పాటించవద్దని, అవి డాక్టర్లు కాదని అంటున్నారు. మీరు షేర్ చేసే లేదా అడిగే విషయాలు చాట్ బాట్స్ స్టోర్ చేస్తాయని, ఆ డేటా ఇతరులకు చేరే ప్రమాదమూ ఉంటుందని హెచ్చరిస్తున్నారు.