News December 30, 2024
ఏకసభ్య కమిషన్‌కు అభిప్రాయాలు తెలపవచ్చు: కలెక్టర్

షెడ్యూల్ కులాల ఉప వర్గీకరణ పై విచారణకు శ్రీరాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో ఏర్పాటైన ఏక సభ్యకమిషన్ సోమవారం గుంటూరు కలెక్టరేట్‌లోని ఎస్ఆర్ శంకరన్ కాన్ఫరెన్స్ హాలుకు వస్తుందని కలెక్టర్ నాగలక్ష్మీ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యహ్నం 2 గంటల వరకు కమిషన్ సభ్యులు అందుబాటులో ఉంటారని చెప్పారు. షెడ్యూల్ కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు తమ అభిప్రాయాలను కమిషన్ సభ్యులకు తెలియజేయవచ్చని అన్నారు.
Similar News
News September 14, 2025
ప్రముఖ శాస్త్రవేత్త రోహిణీప్రసాద్ మన తెనాలి వారే

బహుముఖ ప్రజ్ఞాశాలి, సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, కొడవటిగంటి రోహిణీప్రసాద్ 1949 సెప్టెంబర్ 14న తెనాలిలో జన్మించారు. రోహిణీప్రసాద్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో శాస్త్రవేత్తగా పనిచేశారు. సంగీతం, సాహిత్యం, సైన్స్ మొదలైన అంశాలపై సరళమైన తెలుగులో ఆయన రాసిన వ్యాసాలు, పుస్తకాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. రేడియో యాక్టివిటీ పరికరాలపై పరిశోధన మీద బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి PhD పొందారు.
News September 14, 2025
సంగీత దర్శకుడు శ్రీ మన గుంటూరు జిల్లా వారే

సంగీత దర్శకుడు, గాయకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి (శ్రీ) గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో 1966, సెప్టెంబర్ 13న జన్మించారు. ఈయన సంగీత దర్శకుడు కె. చక్రవర్తి 2వ కుమారుడు. 1993లో గాయం సినిమా శ్రీ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. ఇందులో సిరివెన్నెల రాసిన
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని.. అనే గీతం ఒక ఆణిముత్యం. సింధూరం చిత్రం ఆయన కెరీర్‌లో మరో పెద్ద విజయం.
News September 14, 2025
గుంటూరులో కేజీ చికెన్ ధర ఎంతంటే.?

గుంటూరు శ్రీరామ్ నగర్‌లో ఆదివారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. చికెన్ స్కిన్ లెస్ కేజీ రూ. 220, స్కిన్ కేజీ రూ.200గా అమ్ముతున్నారు. కొరమేను చేపలు కేజీ రూ.450, రాగండి రూ. 180, బొచ్చెలు రూ. 220, మటన్ రూ.950గా విక్రయిస్తున్నారు. నగరంలోని చుట్టుపక్కల అన్ని ప్రాంతాలలో రూ. 20 నుంచి రూ. 50ల వరకు ధరల్లో వ్యత్యాసం ఉంది.