News December 30, 2024

కృష్ణా: వాయిదా పడిన పీజీ పరీక్షలు

image

కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలో 2025 జనవరి 4న జరగనున్న పలు పరీక్షలు వాయిదాపడ్డాయి. 3,4వ తేదీలలో మచిలీపట్నంలో “యువకెరటాలు” కార్యక్రమం జరగనున్నందున జనవరి 4న జరగాల్సిన PG, MBA&MCA 1వ&3వ సెమిస్టర్ పరీక్షలను జనవరి 21న నిర్వహిస్తామని KRU పరీక్షల విభాగం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. అదే విధంగా జనవరి 3న జరగాల్సిన PG, MBA&MCA 1వ&3వ సెమిస్టర్ పరీక్షలు జనవరి 20న నిర్వహిస్తామని పేర్కొంది. 

Similar News

News January 12, 2026

సెమీ మెకనైజ్డ్ ఇసుక రీచ్‌లను గుర్తించండి: కలెక్టర్

image

భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో 24 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు సెమీ మెకనైజ్డ్ కొత్త ఇసుక రీచ్‌లను గుర్తించాలన్నారు.

News January 12, 2026

కృష్ణా జిల్లాలో మరో ఇసుక రీచ్‌కు సన్నాహాలు..!

image

కృష్ణా జిల్లాలో మరో ఇసుక రీచ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. జిల్లాలో ప్రస్తుతం 4 ఇసుక రీచ్‌లు ఉన్నాయి. నార్త్ వల్లూరు, రొయ్యూరు, చోడవరం, పడమటలంకలో ఉన్న ఇసుక రీచ్‌లలో 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉంది. ఘంటసాల మండలం పాపవినాశనంలో మరో రీచ్‌ను ఏర్పాటుకు కలెక్టర్ చర్యలు చేపట్టారు. టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

News January 12, 2026

కృష్ణా: రికార్డు స్థాయి పందేం ఇదే.. అందరి నోట ఒక్కటే మాట!

image

కోడి పందేల చరిత్రలో రికార్డు స్థాయి పందేలు సంచలనం సృష్టిస్తున్నాయి. గతంలో సీసలి బరిలో జరిగిన రూ. 25 లక్షల పందెం ఒక ఎత్తైతే, తాడేపల్లిగూడెంలో ఏకంగా రూ. 1.25 కోట్ల పందేం జరగడం పందెం రాయుళ్లను విస్మయానికి గురిచేసింది. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన ప్రభాకర్ ఈ భారీ పందేంలో నెగ్గి చరిత్ర సృష్టించారు. దీంతో ఈ ప్రాంతంలో పందేలకు క్రేజ్ అమాంతం పెరిగింది.