News March 16, 2024

లాయర్లకు రూ.7,000 స్టైఫండ్ ఇస్తాం: చంద్రబాబు

image

AP: టీడీపీ చీఫ్ చంద్రబాబు న్యాయవాదులపై హామీల వర్షం కురిపించారు. పార్టీ లీగల్ సెల్ వర్క్‌షాప్‌లో మాట్లాడుతూ.. ‘స్వాతంత్ర పోరాటం తరహాలో ఏపీకి ఉన్మాది పాలన నుంచి విముక్తి కల్పించేందుకు న్యాయవాదులు పోరాడాలి. అధికారంలోకి వచ్చాక న్యాయమిత్ర పేరుతో లాయర్లకు ప్రతి నెలా రూ.7వేల స్టైఫండ్ ఇస్తాం. అడ్వొకేట్ల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తాం. ఇళ్ల స్థలాలు ఇస్తాం’ అని వెల్లడించారు.

Similar News

News September 29, 2024

1130 ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్

image

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)లో ఫైర్ విభాగంలో 1130 కానిస్టేబుల్ తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 30తో గడువు ముగుస్తోంది. ఇంటర్ పూర్తి చేసి, 18-23 ఏళ్ల లోపు వారు అర్హులు. రిజర్వేషన్ బట్టి వయోసడలింపు ఉంటుంది. ఎంపికైతే జీతం రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది. వెబ్‌సైట్ లింక్: https://cisfrectt.cisf.gov.in/

News September 29, 2024

కొత్త NCA ప్రత్యేకతలు ఇవే

image

బెంగళూరులో సకల సౌకర్యాలతో బీసీసీఐ కొత్త ఎన్‌సీఏను రూపొందించింది. దాదాపు 40 ఎకరాల్లో 3 మైదానాలు సిద్ధం చేశారు. వీటిలో ఇన్‌డోర్, ఔట్‌డోర్ కలిపి ఏకంగా 86 పిచ్‌లు ఏర్పాటు చేశారు. ఒలింపిక్స్ సైజ్ స్విమ్మింగ్‌పూల్, 80 మంది కూర్చునే కాన్ఫరెన్స్ రూమ్, స్పా, స్టీమ్ బాత్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. అత్యాధునిక ఫిజియోథెరపీ జిమ్, స్పోర్ట్స్, సైన్స్, మెడిసిన్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. త్వరలో దీనిని ప్రారంభిస్తారు.

News September 29, 2024

రిలయన్స్@ రోజుకు రూ.216 కోట్ల ఆదాయం

image

FY2024లో ఆయా కంపెనీలు ప్రకటించిన ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ల ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా రోజుకు ₹216 కోట్ల లాభం ఆర్జిస్తోంది. ఆ తర్వాత వరుసగా SBI(₹187 కోట్లు), HDFC బ్యాంక్(₹179 కోట్లు), ONGC(₹156 కోట్లు), TCS(₹126 కోట్లు), ICICI బ్యాంక్(₹123 కోట్లు), IOC(₹118 కోట్లు), LIC(₹112 కోట్లు), కోల్ ఇండియా (₹102 కోట్లు), టాటా మోటార్స్(₹87 కోట్లు) ఉన్నాయి.