News December 30, 2024

రికార్డు సృష్టించిన ముంబై బాలిక

image

ముంబైకు చెందిన కామ్య కార్తికేయన్(17) రికార్డు సృష్టించారు. ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించిన అత్యంత పిన్నవయస్కురాలిగా చరిత్ర లిఖించారు. ఆసియాలో ఎవరెస్ట్, ఆఫ్రికాలో కిలిమంజారో, యూరప్‌లో ఎల్‌బ్రస్, ఆస్ట్రేలియాలో కొసియస్కో, దక్షిణ అమెరికాలో అకాన్‌కగువా, ఉత్తర అమెరికాలో డెనాలీ, అంటార్కిటికాలో విన్సెంట్ పర్వతాల్ని ఆమె అధిరోహించారు. కామ్య ఏడేళ్ల వయసుకే పర్వాతారోహణను ప్రారంభించడం విశేషం.

Similar News

News January 4, 2025

అతుల్ భార్యకు బెయిల్ మంజూరు

image

బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ భార్య నికితా సింఘానియా, ఆమె తల్లి నిషా సింఘానియా, సోదరుడు అనురాగ్ సింఘానియాకు సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా తన మరణానికి భార్య, అత్త కారణమని అతుల్ 40 పేజీల లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో గత నెల 14న నికిత, నిషా, అనురాగ్‌ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి వీరు పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు.

News January 4, 2025

మణిపుర్ మిలిటెంట్లకు ‘స్టార్ లింక్’ ఇంటర్నెట్!

image

మణిపుర్ మిలిటెంట్లు ఎలాన్ మస్క్‌కు సంబంధించిన ‘స్టార్ లింక్’ ఉపగ్రహం నుంచి వచ్చే ఇంటర్నెట్ సేవలు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. మన దేశంలో స్టార్ లింక్ ఇంటర్నెట్‌కు అనుమతి లేకపోయినా వారు వినియోగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పక్కనే ఉన్న మయన్మార్‌లో స్టార్ లింక్ ఇంటర్నెట్‌కు యాక్సెస్ ఉంది. కాగా గతేడాది మణిపుర్‌లో అల్లర్లు చెలరేగినప్పటి నుంచి అక్కడ కేంద్రం ఇంటర్నెట్ బంద్ చేసిన విషయం తెలిసిందే.

News January 4, 2025

కాంగ్రెస్ అప్పుడు ముద్దు ఇప్పుడు వద్దు: మారిన కేజ్రీ!

image

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఎవరూ మెయిన్ ప్లేయర్‌గా భావించడం లేదు. అరవింద్ కేజ్రీవాలైతే లెక్కచేయడమే లేదు. తమ పోటీ BJPతోనే అన్నట్టుగా వ్యూహాలు రచిస్తున్నారు. కొద్ది వ్యవధిలోనే హస్తం పార్టీపై ఆయన వైఖరి మారిపోయింది. జైలుకెళ్లొచ్చిన కేజ్రీ పొత్తుకోసం పాకులాడటంతో ఢిల్లీ కాంగ్రెస్ వ్యతిరేకించినా AAPని రాహుల్ INDIA కూటమిలో చేర్చుకున్నారు. ఇప్పుడదే AK కాంగ్రెస్‌నెవరైనా <<15062903>>సీరియస్‌<<>>గా తీసుకుంటారా అనేశారు.