News March 16, 2024
సీఏఏ అమలు ఇప్పటికే ఆలస్యమైంది: జగ్గీ వాసుదేవ్
సీఏఏపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టం అమలు ఆలస్యమైందన్నారు. ‘విభజనప్పుడు పొరుగు దేశాల్లో స్థిరపడిన ప్రజలకు సమస్యలు ఎదురైతే మళ్లీ తిరిగి తీసుకొస్తామని నాటి నేతలు హామీ ఇచ్చారు. 75ఏళ్లలో వారు ఎన్నో కష్టాలు అనుభవించారు. 30-40ఏళ్ల క్రితమే కొందరు భారత్ వచ్చినా ఇంకా శరణార్థులుగానే ఉన్నారు. ఇందుకు సిగ్గుగా లేదా?’ అని ప్రశ్నించారు.
Similar News
News November 22, 2024
RECORD: $99000ను తాకిన BITCOIN
బిట్‌కాయిన్ మరో రికార్డు సృష్టించింది. చరిత్రలో తొలిసారి $99000 మైలురాయిని టచ్ చేసింది. శుక్రవారం సింగపూర్‌లో $99388 వద్ద జీవితకాల గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం $98660 స్థాయిలో చలిస్తోంది. US కొత్త ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన NOV 5 నుంచి బిట్‌కాయిన్ మార్కెట్ విలువ లక్ష కోట్ల డాలర్ల మేర పెరగడం గమనార్హం. అనేక సంస్థలు BTC ETFs, OPTIONS ప్రవేశపెడుతుండటంతో డిమాండ్ ఎగిసింది.
News November 22, 2024
అదానీపై అభియోగాలు: వైట్‌హౌస్ ఏం చెప్పిందంటే..
గౌతమ్ అదానీపై నమోదైన అభియోగాలపై అవగాహన ఉందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన్ జేన్ పియరీ తెలిపారు. ఆరోపణలపై మరింత సమాచారం కావాలంటే SEC, DOJను సంప్రదించాలని సూచించారు. ఈ వివాదంతో భారత్, అమెరికా మధ్య విభేదాలేమీ ఏర్పడవని ధీమా వ్యక్తం చేశారు. రెండు దేశాల సంబంధాలు బలమైన పునాదులపై నిర్మించారని, గ్లోబల్ ఇష్యూస్‌పై పూర్తి స్థాయి పరస్పర సహకారం ఉంటుందన్నారు. ఈ వివాదాన్ని నిరంతరం పర్యవేక్షిస్తామని తెలిపారు.
News November 22, 2024
మైసూరులో RC16 షూటింగ్!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కించనున్న RC16 సినిమా షూటింగ్ ఈరోజు నుంచి మొదలుకానుంది. ఈ సందర్భంగా బుచ్చిబాబు మైసూరులోని చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ‘ఇది ఎంతో ముఖ్యమైన రోజు. ఎన్నోరోజులుగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. మీ అందరి ఆశీర్వాదం ఉండాలి’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, చరణ్ కూడా ఇప్పటికే మైసూరుకు చేరుకున్నారు.