News December 30, 2024

NLG: అతడు అడవిని సృష్టించాడు

image

ఎకరం పొలం ఉంటే ఏం పంట వేద్దాం, ప్లాట్లు చేస్తే ఎంత లాభమొస్తది? అని లెక్కలేసుకొనే రోజులివి. కానీ, జాతీయ రహదారికి ఆనుకొని తనకున్న 70 ఎకరాల భూమిని చెట్లు పెంచేందుకు, మూగజీవాలకు ఆవాసంగా మార్చేశారో ప్రకృతి ప్రేమికుడు. జీవరాశులకు ఆహారం, నీళ్లు అందించాలన్న సదుద్దేశంతో రూ.కోట్ల విలువ చేసే భూమిని అడవిగా మార్చేశారు. ఆయనే.. జలసాధన సమితి పేరుతో నల్లగొండ ఫ్లోరైడ్‌ నీటి సమస్యపై పోరాడిన దుశ్చర్ల సత్యనారాయణ.

Similar News

News November 7, 2025

NLG: వేతన బకాయిల కోసం ఎదురుచూపులు

image

చాలీచాలని వేతనాలు.. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల కారణంగా పెట్టిన పెట్టుబడి రాక మధ్నాహ్న భోజన పథకం నిర్వాహకులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. వీటికి తోడుగా గత 6 నెలలుగా జిల్లా వ్యాప్తంగా వేతన బకాయిలు రాకపోవడంతో మధ్నాహ్న భోజన పథకం నిర్వాహకులకు నిర్వహణ మరింత భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిరాణ దుకాణాల నుంచి సరుకులు అరువు తెచ్చి భోజనం వండుతున్నామని తెలిపారు.

News November 7, 2025

పోలీస్ కార్యాలయంలో వందేమాతరం గీతాలాపన

image

వందేమాతరం గీతం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో శుక్రవారం గీతాలాపన కార్యక్రమం జరిగింది. పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి ఎస్పీ పూర్తిస్థాయి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. 1875 నవంబర్ 7న బంకిం చంద్ర ఛటర్జీ ఈ గీతాన్ని రచించారని ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు.

News November 7, 2025

Way2News కథనానికి నల్గొండ కలెక్టర్ స్పందన

image

‘ఇసుక కొరత.. ఇంటి నిర్మాణం జరిగేది ఎట్లా?’అనే శీర్షికతో ఈ నెల 4న Way2Newsలో ప్రచురితమైన కథనానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మైనింగ్ శాఖ అధికారులు జిల్లాలోని ఇసుక రీచ్‌లను పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత లేకుండా చూడాలని ఆమె అధికారులను ఆదేశించారు.