News December 30, 2024
ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపే మాటలు నమ్మొద్దు..ఎస్పీ సూచన

పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ కల్పించే దళారీలు మాటలు నమ్మవద్దని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ సూచించారు. ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రచారం చేసే వారి సమాచారాన్ని ఫోన్ నెంబర్ 9550351100 కి తెలపాలని, వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు.
Similar News
News January 4, 2026
ప.గో: అక్క అనే పిలుపునకు అండగా నిలిచి.. తలకొరివి పెట్టి మానవత్వం చాటి..

రక్త సంబంధం లేకపోయినా చిన్న పిలుపుతో ఏర్పడిన అనుబంధం మానవత్వాన్ని చాటింది. బ్రాడీపేటకు చెందిన కొరటాని శ్రీను(45) శనివారం అనారోగ్యంతో మృతి చెందగా, బంధువులు ఎవరూ రాలేదు. దీంతో శ్రీను ‘అక్క’ అని పిలిచే పొరుగున ఉన్న పతివాడ మావూళ్లమ్మ చలించిపోయింది. తానే స్వయంగా తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు నిర్వహించింది. ఆమె చూపిన ఈ చొరవను చూసి స్థానికులు కంటతడి పెట్టుకుంటూ, మావూళ్లమ్మ పెద్దమనసును అభినందించారు.
News January 4, 2026
బీజేపీ జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలిగా సత్యవతి

బీజేపీ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలిగా నరసాపురానికి చెందిన గన్నాబత్తుల సత్యవతిని నియమించారు. పార్టీ బలోపేతానికి, మహిళా సమస్యల పరిష్కారానికి ఆమె చేస్తున్న కృషిని గుర్తించి పార్టీ ఈ బాధ్యతను అప్పగించింది. సత్యవతి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన పార్టీ అగ్ర నాయకత్వానికి, జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను జిల్లాలోని ప్రతి మహిళకు చేరేలా చూస్తానన్నారు.