News December 30, 2024

గడివేముల వద్ద ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి

image

కర్నూలు జిల్లా గడివేముల మండల పరిధిలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మండల పరిధిలోని పెసరవాయి-కరిమద్దెల గ్రామాల మధ్య బండి ఆత్మకూరు మండలానికి చెందిన ట్రాక్టర్ కాలువలో బోల్తా పడింది. ఈ ఘటనలో వరి నాట్లు వేయడానికి వచ్చిన ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు పశ్చిమబెంగాల్‌కు చెందిన సునీల్ సర్దార్ (45)గా గుర్తించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 17, 2026

మళ్లీ చెప్పున్నా.. జాగ్రత్త: కర్నూలు ఇన్‌ఛార్జ్ ఎస్పీ

image

ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్‌ నేరగాళ్లు SMలో ఫేక్‌ లింకులు పంపి మోసం చేస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలను డీఐజీ, కర్నూలు ఇన్‌ఛార్జ్‌ ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ హెచ్చరించారు. పీఎం కిసాన్‌, ముద్ర లోన్స్‌, సూర్యఘర్‌, అమ్మఒడి వంటి పథకాల పేరుతో వచ్చే లింకులను క్లిక్‌ చేయవద్దన్నారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దన్నారు. అనుమానాస్పద కాల్స్‌, లింకులు వస్తే 1930కు ఫోన్‌ చేయాలన్నారు.

News January 16, 2026

పాణ్యం మండలంలో విషాదం

image

పాణ్యం మండలం తమ్మరాజుపల్లి సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని రత్నమ్మ(50) అక్కడికక్కడే మృతి చెందారు. హైవే దాటుతుండగా గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొని ఆగకుండా వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఆమె ఫుట్‌పాత్‌పై పడి తీవ్ర గాయంతో మృతిచెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

News January 16, 2026

కర్నూలు: మద్యం బాబులూ.. మీకు చిత్తడే..!

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేశారు. డీఐజీ, జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అనుమానాస్పద వాహనాలను ఆపి బ్రీత్ అనలైజర్‌తో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.