News March 16, 2024

ఏసీలు కొంటున్నారా? తీసుకోవాల్సిన జాగ్రత్తలివే!

image

* రూమ్ సైజుకు తగిన సామర్థ్యం ఉన్న ఏసీ తీసుకోవాలి. 110 sq ft గదికి 1 టన్ను కెపాసిటీ ఉన్న ఏసీ సరిపోతుంది.
* ఇన్వర్టర్‌తో కూడిన ఏసీ కొంటే కరెంటును ఆదా చేస్తుంది.
* స్టెబిలైజర్ కూడా తీసుకోవాలి. ఏసీ పాడవకుండా ఉంటుంది.
* కనీసం ఐదేళ్ల పీసీబీ వారంటీ, పదేళ్ల ఇన్వర్టర్ కంప్రెసర్ వారంటీ ఉన్నవి కొనడం ఉత్తమం.
* ఈ కామర్స్ సంస్థలు, డీలర్ల వద్ద కొనేముందు ధరల మధ్య తేడాను గమనించాలి.

Similar News

News September 29, 2024

కొత్త NCA ప్రత్యేకతలు ఇవే

image

బెంగళూరులో సకల సౌకర్యాలతో బీసీసీఐ కొత్త ఎన్‌సీఏను రూపొందించింది. దాదాపు 40 ఎకరాల్లో 3 మైదానాలు సిద్ధం చేశారు. వీటిలో ఇన్‌డోర్, ఔట్‌డోర్ కలిపి ఏకంగా 86 పిచ్‌లు ఏర్పాటు చేశారు. ఒలింపిక్స్ సైజ్ స్విమ్మింగ్‌పూల్, 80 మంది కూర్చునే కాన్ఫరెన్స్ రూమ్, స్పా, స్టీమ్ బాత్ సౌకర్యాలు కూడా ఉన్నాయి. అత్యాధునిక ఫిజియోథెరపీ జిమ్, స్పోర్ట్స్, సైన్స్, మెడిసిన్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. త్వరలో దీనిని ప్రారంభిస్తారు.

News September 29, 2024

రిలయన్స్@ రోజుకు రూ.216 కోట్ల ఆదాయం

image

FY2024లో ఆయా కంపెనీలు ప్రకటించిన ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్ల ప్రకారం రిలయన్స్ ఇండస్ట్రీస్ అత్యధికంగా రోజుకు ₹216 కోట్ల లాభం ఆర్జిస్తోంది. ఆ తర్వాత వరుసగా SBI(₹187 కోట్లు), HDFC బ్యాంక్(₹179 కోట్లు), ONGC(₹156 కోట్లు), TCS(₹126 కోట్లు), ICICI బ్యాంక్(₹123 కోట్లు), IOC(₹118 కోట్లు), LIC(₹112 కోట్లు), కోల్ ఇండియా (₹102 కోట్లు), టాటా మోటార్స్(₹87 కోట్లు) ఉన్నాయి.

News September 29, 2024

కాంగ్రెస్‌లో 10 మంది ఎమ్మెల్యేలు చేరడం పక్కా: దానం నాగేందర్

image

TG: తమపై హైకోర్టులో నడుస్తున్న కేసును బూచిగా చూపి కాంగ్రెస్‌లోకి రావాలనుకుంటున్న MLAలను బీఆర్ఎస్ అగ్రనేతలు ఆపుతున్నారని దానం నాగేందర్ తెలిపారు. GHMC పరిధిలో 10 మంది ఎమ్మెల్యేలు INCలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. కాస్త ఆలస్యమైనా చేరిక పక్కాగా ఉంటుందని మీడియా చిట్‌చాట్‌లో చెప్పారు. గౌరవప్రదంగా ఉండే హరీశ్ కూడా గాడితప్పారని, ఆయన్ను బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు.