News December 30, 2024
పాకాల అభయారణ్యంలో పెద్ద పులి!
కొన్ని రోజులుగా ములుగు, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో సంచరిస్తున్న <<15014632>>పెద్ద పులి పాకాల <<>>అభయారణ్యంలోకి వెళ్లింది. మూడేళ్ల కిందట పాకాల అడవిలోకి వచ్చిన పులి.. మళ్లీ ఇప్పుడు వచ్చిందని అధికారులు గుర్తించారు. నల్లబెల్లి, నర్సంపేట, ఖానాపురం మీదుగా పాకాల అడవిలోకి వెళ్లినట్లు నిర్ధారించారు. పులి అడవిలోకి వెళ్లడంతో ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
Similar News
News January 5, 2025
కొత్త వైరస్.. హన్మకొండ డీఎంహెచ్‌వో సూచనలు
చైనా నుంచి HMPV(హ్యూమన్ మెటా ప్న్యూమో వైరస్) మహమ్మారి గురించి హన్మకొండ DMHO డా. ఏ.అప్పయ్య పలు సూచనలు చేశారు. దీనిపై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పలు జాగ్రత్తలు సూచించిందన్నారు. ఇది శీతాకాలంలో చిన్నపిల్లలు, వృద్ధులలో సాధారణ చలి, జలుబు వంటి లక్షణాలను కలిగించే సాధారణ శ్వాస సంబంధిత వైరస్ అన్నారు. తెలంగాణలో HMPV కేసులపై ఎటువంటి సమాచారం లేదని, అయినప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News January 5, 2025
వరంగల్ జిల్లా కలెక్టర్‌కు MLC వినతిపత్రం
వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద దేవిని ఈరోజు MLC బస్వరాజ్ సారయ్య, 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్‌లు కలెక్టరేట్లో కలిశారు. వరంగల్ నగరానికి చెందిన కార్మిక మిల్లు భవనం స్థలంలో ఎలాంటి పర్మిషన్ ఇవ్వొద్దని, ఇచ్చిన పర్మిషన్ను రద్దు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కూల్చి వేసిన కార్మిక భవన్ ప్రాంతంలోనే కొత్త కార్మిక భవన్‌ను నిర్మించాలని కోరారు.
News January 5, 2025
MHBD: వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ
రోడ్డు భద్రత అవగాహన ప్రమాణాలపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ నుంచి పాలనాధికారి అద్వైత్ కుమార్ సింగ్, ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్, అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు తీసుకుంటున్న చర్యలు, ప్రయాణికులకు కలిగిస్తున్న అవగాహన గురించి వారు మంత్రికి వివరించారు.