News March 16, 2024
BIG BREAKING: కవిత భర్తకు ఈడీ నోటీసులు
TS: ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్కు ఈడీ నోటీసులు జారీ చేసింది. సోమవారం విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. కవిత భర్తతో పాటు ముగ్గురు కవిత వ్యక్తిగత సిబ్బందికి కూడా ఈడీ అధికారులు నోటీసులు అందించారు. ఇప్పటికే నలుగురి ఫోన్లను సీజ్ చేశారు. నిన్న కవిత ఇంట్లో సోదాలు నిర్వహించిన ఈడీ.. ఆయన వ్యాపార లావాదేవీలపై ఆరా తీసింది. ఈ నేపథ్యంలో తాజాగా నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
Similar News
News November 24, 2024
డిసెంబర్ 1 నుంచి ప్రజాపాలన విజయోత్సవాలు
TG: అధికారం చేపట్టి ఏడాది పూర్తికావస్తున్న సందర్భంగా DEC 1-9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలని CM రేవంత్ నిర్ణయించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఉత్సవ వాతావరణం ఉట్టిపడాలని, అన్ని శాఖలు భాగస్వామ్యం కావాలని ఆదేశించారు. స్కూళ్లు, కాలేజీలు, హాస్టళ్లలోనూ వేడుకలు జరపాలన్నారు. తొలి ఏడాది ప్రభుత్వ విజయాలతో పాటు భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలను వివరించాలని అధికారులకు సూచించారు.
News November 24, 2024
IPL వేలం: ఇతనిపైనే అందరి చూపు
ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఐపీఎల్ మెగా వేలం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారత స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్పై అందరి దృష్టి ఉంది. ఈ వేలంలో ఆయనే అత్యధిక ధర పలుకుతారని అంచనా వేస్తున్నారు. రాహుల్, శ్రేయస్, అర్ష్దీప్, ఇషాన్, షమీ వంటి ప్లేయర్లు కూడా అధిక ధర పలికే అవకాశముంది. గత సీజన్లో స్టార్క్ అత్యధికంగా రూ.24.75 కోట్ల ధర పలకగా ఈసారి సరికొత్త రికార్డులు నమోదవుతాయని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
News November 24, 2024
ఈ నెల 27న వారి ఖాతాల్లో డబ్బులు జమ
TG: 2023-24 ఆర్థిక సంవత్సరం, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అక్టోబర్ 24 మధ్య రిటైర్డ్ అయిన కార్మికులకు దీపావళి బోనస్ రిలీజ్ చేస్తున్నట్లు సింగరేణి ఎండీ బలరామ్ తెలిపారు. ఈ నెల 27న వారి ఖాతాల్లోకి రూ.18.27కోట్లు జమ చేస్తామని పేర్కొన్నారు. ఒక్కొక్కరికి గరిష్ఠంగా రూ.93,570 చొప్పున 2,754 మంది కార్మికులకు బోనస్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.