News December 30, 2024

పెద్దగట్టు జాతర.. ఐదు రోజుల కార్యక్రమాలు ఇవే..

image

రాష్ట్రంలోనే అతిపెద్ద రెండో జాతర దురాజ్‌పల్లి (పెద్దగట్టు) జాతర. ఈ జాతర ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు 5 రోజుల పాటు వైభవంగా జరగనుంది. మొదటి రోజు దేవరపెట్టే తరలింపు, 2వ రోజు కంకణ అలంకరణలు, 3వ రోజు స్వామివారి చంద్రపట్నం, 4వ రోజు దేవరపెట్టే కేసారం తరలింపు, 5వ రోజు మకరతోరణం తొలగింపుతో జాతర ముగుస్తుంది. ఇప్పటికే అధికారులు జాతరకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Similar News

News January 18, 2026

NLG: మేయర్ పీఠంపై మూడు పార్టీల గురి!

image

NLG కార్పొరేషన్ మేయర్ పీఠం జనరల్ మహిళకు కేటాయించడంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారనుంది. దీంతో అధికార పార్టీతో పాటు అటు BRS, ఇటు BJPలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. 33వ వార్డు నుంచి మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి భార్య చైతన్య, BRS మాజీ ఛైర్మన్ సైదిరెడ్డి ఆయన భార్యను పోటీలో నిలుపుతుండగా, BJP నుంచి పిల్లి రామరాజు భార్య సత్యవతి 8వ వార్డు నుంచి పోటీ చేయనున్నారు.

News January 17, 2026

నల్గొండ: పారదర్శకంగా మున్సిపల్ రిజర్వేషన్ల ఖరారు: కలెక్టర్ చంద్రశేఖర్

image

జిల్లాలోని నగరపాలక సంస్థతో పాటు ఆరు మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ పద్ధతిలో పారదర్శకగా ఈ కేటాయింపులు చేపట్టారు. 2011 జనాభా లెక్కలు, బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ ప్రక్రియ నిర్వహించామని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.

News January 17, 2026

నల్గొండ కార్పొరేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి

image

నల్గొండ మున్సిపాలిటీని నగరపాలక సంస్థగా మారుస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో, శనివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. పాత మున్సిపల్ భవనంలోనే కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి ఆయన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. కార్పొరేషన్‌గా మారడంతో నగర అభివృద్ధికి మరిన్ని నిధులు, వసతులు సమకూరుతాయని తెలిపారు.