News March 16, 2024
ప్రధాని మోడీ సభకు వచ్చే వాహనాల పార్కింగ్ వివరాలు
నిజామాబాద్, కోరుట్ల, రాయికల్ నుండి వచ్చే వాహనాలను లింగంపేట రోడ్డు, బీట్ బజార్, మార్కెట్ యార్డులో పార్కింగ్ చేసుకోవాలని జగిత్యాల ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. కరీంనగర్ వైపు నుండి వచ్చేవారు మెడికల్ కాలేజీ, ఎగ్జిబిషన్ గ్రౌండ్, ధర్మశాల పార్కింగ్ ప్లేస్‌లో, ధర్మపురి, సారంగాపూర్, గొల్లపల్లి వైపు నుండి వచ్చే వాహనాలను పాత బస్టాండ్ వద్ద గల మినీ స్టేడియంలో పార్కింగ్ చేసుకోవాలన్నారు.
Similar News
News November 22, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.1,77,988 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.90,009 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.54,680, అన్నదానం రూ.33,299 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
News November 22, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ సిరిసిల్లలో గుర్తుతెలియని వాహనం ఢీకొని రెండు పశువులు మృతి. @ మానకొండూరు మండలంలో బస్సు, బైక్ డీ.. వ్యక్తీ మృతి. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ జగిత్యాల మండలంలో పేలిన ఎలక్ట్రిక్ స్కూటీ. @ సారంగాపూర్ మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన జగిత్యాల అడిషనల్ కలెక్టర్. @ జగిత్యాలలో దివ్యాంగుల క్రీడలు ప్రారంభం.
News November 21, 2024
KNR: ఇతర పంటలు వేసిన రైతుల పరిస్థితి ఏంటి!
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సన్న రకం వరి సాగు చేసిన రైతులకు క్వింటాకు రూ.500 బోనస్ ప్రభుత్వం చెల్లిస్తోంది. దీంతో ఇతర పంటలు వేసిన మా పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు రైతు భరోసా రాక, ఇటు బోనస్ రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉమ్మడి జిల్లాలో వానాకాలం సీజన్ ముగిసిపోయినా ఇప్పటివరకు రైతు భరోసా ఊసే ప్రభుత్వం ఎత్తకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.