News March 16, 2024

ఓటరు కార్డు లేకున్నా పర్వాలేదు: సీఈవో

image

AP: ఎన్నికల్లో ఓటు కోసం దరఖాస్తు చేసిన వారికి నెలాఖరులోగా ఓటరు కార్డులు అందిస్తామని సీఈవో ముఖేశ్ కుమార్ మీనా తెలిపారు. ఓటరు గుర్తింపు కార్డు లేకుంటే 12 రకాల ఐడీ కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు వివరించారు.

Similar News

News November 24, 2024

క్యాన్సర్‌పై సిద్ధూ వ్యాఖ్యలను నమ్మకండి: టాటా మెమోరియల్ హాస్పిటల్

image

డైట్ కంట్రోల్ వల్ల తన భార్యకు స్టేజ్-4 <<14676790>>క్యాన్సర్<<>> నయమైందన్న మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ కామెంట్స్‌పై టాటా మెమోరియల్ ఆసుపత్రి స్పందించింది. ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు ఎవరు చేసినా నమ్మొద్దని క్యాన్సర్ పేషెంట్లకు సూచించింది. ‘పసుపు, వేపాకు తినడం వల్ల క్యాన్సర్‌ను జయించొచ్చన్నది సరికాదు. దీన్ని నమ్మి వైద్యం తీసుకోవడం మానొద్దు. ఎలాంటి సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించాలి’ అని కోరింది.

News November 24, 2024

స్టార్క్ బెదిరింపులపై రాణా ఏమన్నారంటే?

image

తొలి టెస్టులో ఆస్ట్రేలియన్ ప్లేయర్ స్టార్క్‌తో <<14684131>>సరదా సంభాషణ<<>> జరిగిందని బౌలర్ హర్షిత్ రాణా చెప్పారు. మైదానంలో ఇలాంటివి జరుగుతుంటాయని, ఇది పెద్ద విషయం కాదన్నారు. హెడ్‌ను ఔట్ చేయడంపై జట్టు ఆటగాళ్లతో చర్చించుకున్నట్లు తెలిపారు. ఒక ఎండ్ నుంచి బ్యాటర్లపై బుమ్రా ఒత్తిడి పెంచి మరో ఎండ్‌లోని బౌలర్ పనిని సులభం చేస్తారని పేర్కొన్నారు. కాగా తొలి ఇన్నింగ్సులో హర్షిత్ 3 వికెట్లు తీశారు.

News November 24, 2024

గ్రూప్-4 అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత ఎప్పుడంటే?

image

TG: డిసెంబర్ 1 నుంచి 9 రోజుల పాటు నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలలో గ్రూప్-4 నియామక పత్రాలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. వచ్చే నెల పెద్దపల్లిలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల వెలువడిన తుది ఫలితాల్లో TGPSC 8,084 మంది అభ్యర్థులను పలు పోస్టులకు ఎంపిక చేసింది.