News December 30, 2024
చేబ్రోలు: ఆటో డ్రైవర్ కూతురు CAలో ఉత్తీర్ణత
ఏలూరు(D) చేబ్రోలుకి చెందిన పుట్టా వీరన్న, శ్రీదేవి దంపతుల కుమార్తె గీతాంజలి సీఏలో ఉత్తీర్ణత సాధించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. చేబ్రోలు, నారాయణపురంలో ప్రాథమిక విద్యాబ్యాసం సాగించిన గీతాంజలి.. ఇంటర్ అనంతరం CAలో ఉచిత సీటు సాధించారు. తండ్రి వీరన్న ఆటో డ్రైవర్గా కష్టపడుతూ గీతాంజలిని ఎంతగానో ప్రోత్సహిస్తూ వచ్చారు. పట్టుదలతో చదివిన గీతాంజలి సీఏ ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులను గర్వపడేలా చేశారు.
Similar News
News January 5, 2025
భీమవరం: ‘మంత్రి నారా లోకేశ్ పర్యటన ఏర్పాట్లను పూర్తిచేయాలి’
జనవరి 6న ఉండి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేశ్ పర్యటింనున్నారు. లోకేశ్ పర్యటన ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆ రోజున నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రారంభోత్సవాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. అధికారులు కలిసికట్టుగా పనిచేసి కార్యక్రమం విజయవంతానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
News January 4, 2025
బియ్యం సేకరణ వేగవంతంగా జరగాలి: జేసీ
బియ్యం సేకరణ వేగవంతంగా జరగాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. శనివారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో జేసీ రాహుల్ కుమార్ రెడ్డి జిల్లాలోని 14 గిడ్డంగులు యజమానులతో సమావేశమై సమీక్షించారు. జేసీ మాట్లాడుతూ.. రైస్ మిల్లులో మర ఆడిన బియ్యాన్ని త్వరితగతిన దిగుమతి అయ్యేలా తగిన హామాలీలను సమకూర్చుకుని బియ్యం దిగుమతికి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు.
News January 4, 2025
జగన్ మోసం చేశారు: నిమ్మల
పోలవరం నిర్వాసితులకు 2017లోనే చంద్రబాబు రూ.800 కోట్లు విడుదల చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లు పరిధిలోని 6 గ్రామాల్లో రూ.3 కోట్లతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వంలో పోలవరం నిర్వాసితులకు రూ.10 లక్షల వరకు ఇస్తామని చెప్పి జగన్ మోసం చేశారు. తాజాగా మేము ఒకేరోజు నిర్వాసితులకు రూ.815 కోట్లు చెల్లించాం’ అని నిమ్మల అన్నారు.