News December 30, 2024

ICAR శాస్త్రవేత్తగా ఖమ్మం జిల్లా వాసి

image

తిరుమలాయపాలెం మండల పరిధి సుబ్లేడుకు చెందిన లత ఇటీవల జరిగిన నేషనల్ అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీసెస్ (ICAR)పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచారు. ప్లాంట్ పాథాలజీ (మొక్కల వ్యాధి అధ్యయన శాస్త్రం) విభాగంలో భారత వ్యవసాయ మండలి శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. పరిశోధనలు చేసి అన్నదాతలను ఆదుకోవడమే లక్ష్యమని లత అన్నారు.

Similar News

News January 22, 2026

ఖమ్మం: మున్సిపల్ పోరు.. సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..!

image

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి పెరిగింది. పార్టీలన్నీ గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. ఆశావహులు భారీగా ఉండటంతో అభ్యర్థుల ఎంపిక పార్టీలకు సవాలుగా మారింది. కాంగ్రెస్‌లో పోటీ తీవ్రంగా ఉండటంతో సర్వేల ఆధారంగా ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. అటు బీఆర్ఎస్ సైతం సర్వేలతో పాటు వార్డుల్లో పట్టున్న నేతల కోసం కసరత్తు చేస్తున్నాయి. అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేస్తూ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి.

News January 22, 2026

మహిళా సమాఖ్యలకు ఆర్టీసీ ‘అద్దె’ తోడ్పాటు

image

మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్దె బస్సుల పథకం ఉమ్మడి జిల్లాలో సత్ఫలితాలనిస్తోంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని 21 మండల సమాఖ్యలు నిర్వహిస్తున్న బస్సులకు ఆర్టీసీ రూ.87.52 లక్షల అద్దె చెల్లించింది. ఒక్కో బస్సుకు నెలకు సగటున రూ.69,468 ఆదాయం లభిస్తోంది. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.30 లక్షల నిధులతో ప్రారంభమైన ఈ ప్రక్రియ మహిళలను విజయవంతమైన వ్యాపారవేత్తలుగా మారుస్తోంది.

News January 22, 2026

ఖమ్మం: సర్కారీ బడులకు మహర్దశ.. రూ.7.44 కోట్ల విడుదల

image

ఖమ్మం జిల్లాలోని 1,183 ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం రూ.7.44 కోట్ల నిధులు మంజూరు చేసింది. మౌలిక వసతులు, మరమ్మతుల కోసం రూ.4.99 కోట్లు, సివిల్ పనులకు రూ.78.85 లక్షలు కేటాయించారు. కరాటే, క్రీడలు, బాలికా సాధికారిత కార్యక్రమాలకూ ప్రత్యేక నిధులు ఇచ్చారు. పాఠశాలల యాజమాన్య కమిటీల ద్వారా ఈ నిధులను వెచ్చించి, బడుల రూపురేఖలు మార్చాలని విద్యాశాఖ నిర్ణయించింది.