News December 30, 2024
విజయవాడ లేదా రాజమండ్రిలో ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు విజయవాడ, రాజమండ్రి ప్రాంతాలను చిత్ర యూనిట్ పరిశీలిస్తోంది. ఇవాళ Dy.CM పవన్‌ను కలిసిన నిర్మాత దిల్ రాజు జనవరి 4 లేదా 5న జరిగే ఈవెంట్‌కు రావాలని ఆహ్వానించారు. పవన్ తన నిర్ణయం వెల్లడించగానే వేదికను యూనిట్ ఖరారు చేయనుంది. అటు పవన్‌తో భేటీలో బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపుపై దిల్ రాజు మాట్లాడారు.
Similar News
News March 29, 2026
ఫోన్‌లో 100% ఛార్జింగ్ మంచిదేనా?

ఫోన్‌ను రాత్రంతా ఛార్జింగ్ పెట్టడం మంచిది కాదని ఎక్స్‌పర్టులు హెచ్చరిస్తున్నారు. ‘100%’లో ఎక్కువసేపు ఛార్జింగ్ పెట్టి ఉండటం వల్ల బ్యాటరీలపై అధిక వోల్టేజ్ ఒత్తిడి పడుతుందని అంటున్నారు. దీంతో బ్యాటరీ జీవితకాలం తగ్గిపోతుందని, 10-15 శాతం వరకు లైఫ్ పడిపోతుందని చెబుతున్నారు. 20-80% మధ్య ఛార్జింగ్ ఉంటే ఫోన్లు ఉత్తమంగా పని చేస్తాయంటున్నారు. అత్యవసర సమయాల్లో ఫుల్ ఛార్జ్‌తో వాడుకోవచ్చని సూచిస్తున్నారు.
News March 29, 2026
రేపటి మ్యాచ్‌కు విధ్వంసకర బ్యాటర్ దూరం

IPL: రేపు RRతో జరిగే మ్యాచ్‌కు విధ్వంసకర బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్ దూరమయ్యారు. ట్రైనింగ్‌లో పక్కటెముకల కండరాలు పట్టేయడంతో రేపటి మ్యాచ్ ఆడట్లేదని CSK హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపారు. త్వరలోనే ఫిటెనెస్ సాధిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. తొలి రెండు మ్యాచులు అనంతరం బ్రెవిస్ అందుబాటులో ఉంటారని క్రీడావర్గాలు చెబుతున్నాయి. రేపు గౌహతిలో ఈ 2 జట్ల మధ్య రాత్రి 7.30గంటలకు మ్యాచ్ జరగనుంది.
News March 29, 2026
జమ్మూకశ్మీర్ ఆటగాడిపై ప్రధాని ప్రశంసలు

జమ్మూకశ్మీర్ బౌలర్ ఆకిబ్ నబీని ప్రధాని మోదీ అభినందించారు. ‘ఏడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత J&K జట్టు తొలి రంజీ ట్రోఫీని సాధించింది. ఈ సీజన్‌లో 60 వికెట్లు తీసిన ఆకిబ్ నబీ ప్రదర్శన గురించి దేశమంతటా చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో అతడి స్ఫూర్తితో మరెందరో ఆ ప్రాంతం నుంచి క్రీడల్లోకి వస్తారు’ అని ‘మన్ కీ బాత్’లో ప్రశంసించారు. కాగా IPL వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ.8.4 కోట్లకు దక్కించుకుంది.


