News March 16, 2024
ఉమ్మడి కర్నూలు జిల్లాలో MLA బరిలో ఇద్దరు మహిళలు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 MLA స్థానాలు, 2 MP స్థానాలు ఉన్నాయి. వీటిలో YCP అధిష్ఠానం ఇద్దరు మహిళా నేతలకు MLA స్థానాలను కేటాయించింది. పత్తికొండ MLA అభ్యర్థిగా కంగాటి శ్రీదేవిని, ఎమ్మిగనూరు MLA అభ్యర్థిగా బుట్టా రేణుకను ప్రకటించింది. మొత్తం మీద ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గాను.. ఇద్దరు మహిళా నేతలను YCP పోటీలో నిలిపింది.
Similar News
News March 31, 2025
కర్నూలు: రూ.71.47 కోట్ల పన్నులు వసూలు

నగరాభివృద్ధికి పన్నులు చెల్లించి సహకరించాలనే కర్నూలు నగరపాలక సంస్థ పిలుపునిచ్చింది. స్పందించిన బకాయిదారులు అత్యధిక సంఖ్యలో పన్నులు చెల్లించినందుకు నగరపాలక మేనేజర్ చిన్నరాముడు, ఆర్వో ఇశ్రాయేలు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం వారు కేఎంసీ కార్యాలయంలోని పన్ను వసూలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ లేనంతగా రూ.71.47 కోట్లు పన్ను రూపంలో వసూలు అయినట్లు తెలిపారు.
News March 31, 2025
కర్నూలు: 12వ రోజుకు చేరిన మున్సిపల్ చైర్ పర్సన్ దీక్ష

నాలుగేళ్ల పాలనలో ఎలాంటి తప్పు చేయలేదని, సొంత పార్టీ ఐనా వైసీపీ కౌన్సిలర్లు తనను ఛైర్మన్ పదవి నుంచి తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని నిరసిస్తూ ఆదోని మున్సిపల్ చైర్ పర్సన్ శాంత దీక్ష చేపట్టారు. ఈ దీక్ష సోమవారం 12వ రోజుకు చేరుకుంది. ఉగాది, రంజాన్ పండగలు ఉన్నప్పటికీ ఈనెల 20 నుంచి దీక్ష నిరంతరంగా కొనసాగిస్తున్నారన్నారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తనకు న్యాయం చేయాలని శాంత కోరారు.
News March 31, 2025
ఆదోనిలో సచివాలయ ఉద్యోగి సూసైడ్

ఆదోని మండలం కపటి గ్రామ సచివాలయ ఉద్యోగి మధు సూసైడ్ చేసుకున్నాడు. శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన మధు (26) కపటిలో డిజిటల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చి భోజనం చేసి మేడపై గదిలో పడుకున్నాడు. ఆదివాదం ఉదయం తల్లిదండ్రులు చూడగా .. అప్పటికే ఉరివేసుకుని చనిపోయాడు. తండ్రి నారాయణరావు ఫిర్యాదుతో త్రీ టౌన్ సీఐ రామలింగయ్య కేసు నమోదు చేశామన్నారు.