News December 30, 2024

మన్మోహన్‌కు భారతరత్న.. అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

image

TG: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సీఎం రేవంత్ ప్రతిపాదనకు అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి. ఇక తీర్మానాన్ని కేంద్రం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లనుంది. మరోవైపు అసెంబ్లీలో సభ్యులు సింగ్‌కు ఘనంగా నివాళి అర్పించారు.

Similar News

News November 11, 2025

ఢిల్లీ బ్లాస్ట్ సూసైడ్ అటాక్ కాదా?

image

ఢిల్లీ బ్లాస్ట్ సూసైడ్ అటాక్ కాదని, భయాందోళనలో తొందరపడి చేసిన దాడిగా దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు ANI పేర్కొంది. ‘టెర్రర్ నెట్‌వర్క్స్‌పై దాడుల నేపథ్యంలో ఆ ఒత్తిడిలో ఇలా చేసి ఉండొచ్చు. నిందితుడు రెగ్యులర్ సూసైడ్ బాంబింగ్ పాటర్న్ ఫాలో కాలేదు. ఇంటెన్షనల్‌గా దేనిని ఢీకొనలేదు. పూర్తిగా డెవలప్ కాని బాంబును వాడటంతో తీవ్రత తగ్గింది’ అని దర్యాప్తు అధికారులు భావిస్తున్నట్లు తెలిపింది.

News November 11, 2025

జూబ్లీహిల్స్‌లో BRS గెలుపు: మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్

image

TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో BRS పార్టీ గెలుస్తుందని ‘మిషన్ చాణక్య’ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. BRSకు 41.60%, కాంగ్రెస్‌కు 39.43%, BJPకి 18.97% ఓటు షేర్ వస్తుందని పేర్కొంది. షేక్‌పేట్, బోరబండ, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, సోమాజిగూడ డివిజన్లలో BRSకు, యూసుఫ్‌గూడ, రహమత్ నగర్‌ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం వస్తుందని తెలిపింది.

News November 11, 2025

నటి సాలీ కిర్క్‌ల్యాండ్ కన్నుమూత

image

ప్రముఖ హాలీవుడ్ నటి సాలీ కిర్క్‌ల్యాండ్(84) కన్నుమూశారు. డిమెన్షియాతో బాధపడుతున్న ఆమె పలుమార్లు కింద పడటంతోపాటు ప్రాణాంతక ఇన్ఫెక్షన్ల కారణంగా చికిత్స పొందుతూ చనిపోయారు. 1987లో Anna చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఆమె ఆస్కార్‌కు నామినేట్ అయ్యారు. 1968లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సాలీ 200కు పైగా చిత్రాలు, టెలివిజన్ సిరీస్‌లలో నటించారు. గోల్డెన్ గ్లోబ్ సహా అనేక ప్రతిష్ఠాత్మక అవార్డులను సాధించారు.