News March 16, 2024
NLG: గ్రామీణ మహిళలకు గుడ్ న్యూస్

స్టేట్ బ్యాంకు ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లాలోని నిరుద్యోగ గ్రామీణ మహిళలకు బ్యూటీ పార్లర్లో 30 రోజుల పాటు ఉచిత శిక్షణను భోజన వసతి సౌకర్యములతో ప్రారంభిస్తున్నట్లు SBI-RSETI డైరెక్టర్ రఘుపతి తెలిపారు. 19 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండి 10వతరగతి పాసైన నిరుద్యోగ గ్రామీణ మహిళలు ఈనెల 25 లోపు SBI-RSETI, రాంనగర్, నల్గొండలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
Similar News
News August 17, 2025
NLG: ఆలస్యమైనా.. ఆశలు నింపాయి!

నల్గొండ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్గాలు ఆశలు నింపాయి. మొన్నటి వరకు అంతంత మాత్రమే పడడంతో సాగు, తాగునీటిపై కొంత భయం ఉండేది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ఆ ఆందోళన అక్కర్లేదనే నమ్మకం ఏర్పడింది. గత కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా మెరుగైన వర్షపాతం నమోదైంది. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. చెరువులు, కుంటలు నిండుతున్నాయి. మూసీ, శాలిగౌరారం ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.
News August 17, 2025
NLG: జిల్లాలో 65 శాతానికి పైగానే వర్షపు నీరు వృధా..!

NLG జిల్లాలో నూతన గృహ నిర్మాణాలు విస్తరిస్తున్నాయి. ప్రధానంగా పట్టణంతో పాటు శివారులోని గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇళ్లు, బహుళ అంతస్తుల భవంతుల నిర్మాణాలు జోరందుకోవడంతో భూగర్భజలాల వినియోగం బాగా పెరుగుతోంది. ఏటా కురుస్తున్న వర్షపు నీటిని నేల గర్భంలోకి ఇంకించేందుకు అవసరమైన రీచార్జింగ్ పిట్స్ లేకపోవడంతో సుమారు 65 నుంచి 70 శాతం మేర వృథాగా పోతున్నట్లు భూగర్భజల నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News August 17, 2025
NLG: ఇక సౌర వెలుగులు.. సోలార్ ఏర్పాట్లు

ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు కరెంట్ బిల్లుల భారం తగ్గించుకోవాలని భావిస్తోంది. ఆ దిశగా చర్యలు తీసుకోవాలంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇటీవల జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ క్రమంలో దృష్టి సారించిన యంత్రాంగం ఆయా ప్రభుత్వ భవనాలు, వాటికి వినియోగిస్తున్న విద్యుత్ కనెక్షన్ల వివరాలు సేకరిస్తున్నారు.