News December 30, 2024

ఆ ఘటనల్లో చర్యలు తీసుకోరా?: ఎమ్మిగనూరు MLA

image

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టీడీపీ ఎమ్మెల్యే డా.బీవీ జయనాగేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎమ్మిగనూరు ఎస్ఐపై దాడి, అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం ఎంపీడీవోపై దాడి ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలపై చర్యలు ఎందుకు ఆలస్యమవుతున్నాయని కర్నూలు జిల్లా ఎస్పీని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థలో విశ్వాసం పెంచాలని, వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రజలు ప్రశ్నించక మానరు అని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News

News January 5, 2025

అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల లబ్ధి: కలెక్టర్

image

రాష్ట్ర ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని, అర్హత గల ప్రతి ఒక్కరికీ సంక్షేమ లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ జీ.రాజకుమారి అన్నారు. శనివారం నంద్యాల కలెక్టరేట్లో లూయిస్ బ్రెయిలీ 217వ జయంతి సందర్భంగా అంతర్జాతీయ ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

News January 5, 2025

సీఎస్ కర్నూలుకు రావడం గర్వకారణం: కలెక్టర్

image

కర్నూలుకు రావాలని ఆహ్వానించగానే చీఫ్ సెక్రటరీ విజయానంద్ జిల్లాలో పర్యటించడంపై కలెక్టర్ పీ.రంజిత్ బాషా హర్షం వ్యక్తం చేశారు. బీ.క్యాంపులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని సీఎస్ ప్రారంభించడం గర్వకారణమన్నారు. కర్నూలు జిల్లాలోనే అత్యధిక విద్యార్థులు ఈ కళాశాలలో చదువుతున్నట్లు సీఎస్‌కు వివరించారు. ఇంటర్ విద్యార్థులకు ఈ పథకం అమలు హర్షణీయమని కలెక్టర్ కొనియాడారు.

News January 4, 2025

కబళించిన మృత్యువు!

image

ఊర్లో దేవర. కొత్త దుస్తుల కోసం ఆ దంపతులు అనంతపురం జిల్లా యాడికి వెళ్లారు. సంతోషంగా తిరుగుపయణం అవగా వారి బైక్‌ను బొలెరో ఢీకొంది. ఈ విషాద ఘటనలో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం చెన్నంపల్లికి చెందిన రాజశేఖర్ (38), సుమలత (35) మరణించారు. కొత్త దుస్తుల కోసం పాఠశాల నుంచి హుషారుగా ఇంటికి వచ్చిన పిల్లలు పూజిత, మిథిల్ తల్లిదండ్రుల శవాలను చూసి కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషాద ఘటనతో ఇద్దరు చిన్నారులూ అనాథలయ్యారు.