News December 30, 2024

మేం చాలా గొప్పగా పనిచేస్తున్నాం: పవన్

image

AP: గత ప్రభుత్వం కన్నా తమ ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తుందని డిప్యూటీ CM పవన్ అన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలపై అధికారులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారని మండిపడ్డారు. YCP అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని, పనిచేసే సంస్కృతిని చంపేసిందని విమర్శించారు. గత ప్రభుత్వం తొలి 6 నెలలు, ఈ ప్రభుత్వం 6 నెలల పాలనను బేరీజు వేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంటుందన్నారు.

Similar News

News February 5, 2025

ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక నేత కన్నుమూత

image

ప్రపంచ ఇస్మాయిలీ ముస్లింల ఆధ్యాత్మిక నేత ఆగా ఖాన్(88) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆగా ఖాన్ డెవలప్‌మెంట్ నెట్ వర్క్ Xలో వెల్లడించింది. ఆయన వారసుడిని త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. ఆగా ఖాన్‌కు ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. 1957లో ఆయన ఇమామ్‌గా బాధ్యతలు స్వీకరించారు.

News February 5, 2025

పట్టణాలు చిన్నవే కానీ లగ్జరీ షాపింగ్‌లో టాప్!

image

భారత్‌లో చిన్న పట్టణాల ప్రజలు లగ్జరీ షాపింగ్‌పై భారీగా వెచ్చిస్తున్నారని టాటా క్లిక్ లగ్జరీ నివేదిక తెలిపింది. ఈ-కామర్స్ విస్తృతి పెరగడంతో మారుమూల పట్టణాల ప్రజలు సైతం ఆన్‌లైన్‌లో ఖరీదైన బ్రాండ్ల ఉత్పత్తుల్ని కొనుగోలు చేస్తున్నారని పేర్కొంది. ‘వాచీలు, చెప్పులు, దుస్తులు, యాక్సెసరీస్‌ను ఖర్చుకు వెనుకాడకుండా కొంటున్నారు. ఉత్పత్తిపై పూర్తిగా రిసెర్చ్ చేశాకే కొనుగోలు చేస్తున్నారు’ అని వెల్లడించింది.

News February 5, 2025

APPLY NOW.. తెలుగు రాష్ట్రాల్లో 13,762 ఉద్యోగాలు

image

నేషనల్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ రీక్రియేషన్ మిషన్(NRDRM) తెలుగు రాష్ట్రాల్లో 6,881 ఉద్యోగాల చొప్పున పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. టెన్త్-పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఆధారంగా అర్హులుగా పేర్కొంది. నేటి నుంచి ఈ నెల 24 వరకు దరఖాస్తులు స్వీకరిస్తోంది. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.399 దరఖాస్తు ఫీజు. రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. అప్లై చేసుకునేందుకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

error: Content is protected !!