News March 16, 2024

NLR: తొలిసారి ఎమ్మెల్యేలుగా నలుగురి పోటీ

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నలుగురు వైసీపీ అభ్యర్థులు తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఉదయగిరి నుంచి మేకపాటి రాజగోపాల్ రెడ్డి, వెంకటగిరి నుంచి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, గూడూరు నుంచి మేరిగ మురళీధర్, నెల్లూరు నగరం నుంచి ఖలీల్ అహ్మద్ ఈ జాబితాలో ఉన్నారు. ఆదాల, రామిరెడ్డి నాలుగో సారి, కిలివేటి, కాకాణి మూడో సారి, మేకపాటి విక్రమ్ రెడ్డి రెండో సారి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు.

Similar News

News November 23, 2024

ప్రతినిధులు జిల్లా అభివృద్ధిలో భాగ స్వాములు కావాలి : ఆనం

image

స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని అన్నారు. ప్రభుత్వాలు నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని, అ మేరకు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

News November 23, 2024

రాజ్యాంగానికి అతీతంగా చంద్రబాబు పాలన: కాకాణి

image

రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి అరాచకపాలనకు సీఎం చంద్రబాబు బీజాల వేశాడని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. YSRCP అధినేత జగన్, ఆయన కుటుంబీకులపై అనుచిత పోస్ట్‌లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన వేదాయాపాలెం P.Sలో ఫిర్యాదు చేశారు. పార్టీ కార్యకర్తలను వేధిస్తున్న ఏ ఒక్కరినీ వదిలిపెట్టనని కాకాణి హెచ్చరించారు. తమ పార్టీ కార్యకర్తల ఆవేదనను ప్రభుత్వం తట్టుకోలేదని స్పష్టం చేశారు.

News November 23, 2024

అంచనాల కమిటీ సభ్యులుగా గూడూరు ఎమ్మెల్యే ఎంపిక

image

అసెంబ్లీలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల్లో అంచనాల కమిటీ సభ్యుడిగా గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్‌ ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన అంచనాల కమిటీ సభ్యుడిగా అవకాశం కల్పించిన  ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బాబుతో సహ శాసన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.