News December 30, 2024
ఇంకొక్కరోజులో జనరేషన్ బీటా వచ్చేస్తోంది

జనరేషన్ ఆల్ఫాకు రేపటితో గుడ్‌బై చెప్పనున్న మానవాళి కొత్త ఏడాదిలో జనరేషన్ బీటాకు స్వాగతం పలకనుంది. 2025-2039 మధ్య జన్మించే పిల్లలను ఇక నుంచి జనరేషన్ బీటాగా పరిగణిస్తారు. 2035 నాటికి ప్రపంచ జనాభాలో వీరు 16% ఉంటారని నిపుణులు అంచనా వేస్తున్నారు. విస్తృతమైన సాంకేతిక పరిజ్ఞానం, వసతులు వంటి సౌలభ్యాలతో వీరు 22వ శతాబ్దాన్ని కూడా చూస్తారని లెక్కలేస్తున్నారు.
Similar News
News October 29, 2025
అలా అయితే బంగ్లాదేశ్‌కు వెళ్తా: షేక్ హసీనా

భారత్‌లో ఉంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తొలిసారి మీడియాతో తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు. రాబోయే బంగ్లా ప్రభుత్వం చట్టబద్ధంగా ఎన్నికవ్వాల్సిన అవసరం ఉందని రాయిటర్స్‌కు మెయిల్‌లో తెలిపారు. అవామీ లీగ్‌కు లక్షలాది మంది మద్దతిస్తున్నారని, తమ పార్టీని పోటీకి అనుమతించకుంటే 2027 ఎన్నికలను వారు బహిష్కరిస్తారన్నారు. చట్టబద్ధమైన ప్రభుత్వం, శాంతిభద్రతలు అదుపులో ఉంటే బంగ్లా వెళ్తానని చెప్పారు.
News October 29, 2025
ఇతిహాసాలు క్విజ్ – 50 సమాధానాలు

1. తులసి దేవికి పూర్వ జన్మలో ఉన్న పేరు ‘బృందా దేవి’.
2. త్రిపురాంతకుడు అంటే ‘పరమ శివుడు’.
3. కర్ణుడి కవచకుండలాలను దానం చేయమని కోరిన దేవుడు ‘ఇంద్రుడు’.
4. వాక్కుకు అధిష్టాన దేవత వాగ్దేవి. అంటే సరస్వతీ దేవి.
5. పరశురాముడు తన తల్లి తలను తండ్రి ‘జమదగ్ని’ ఆజ్ఞ మేరకు నరికాడు.
<<-se>>#Ithihasaluquiz<<>>
News October 29, 2025
హైదరాబాద్‌లో అతిపెద్ద మెక్ డొనాల్డ్స్ కేంద్రం ప్రారంభం

అంతర్జాతీయ ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం ‘మెక్ డొనాల్డ్స్’ 1.56 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ‘గ్లోబల్ ఆఫీస్(గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్)’ను HYDలో ఏర్పాటు చేసింది. డిప్యూటీ CM భట్టి, మంత్రి శ్రీధర్ బాబు దీన్ని ప్రారంభించారు. అమెరికా బయట మెక్ డొనాల్డ్స్‌కు ఇదే అతిపెద్ద కేంద్రం. ఇది ఆ కంపెనీ ఇన్నోవేషన్, ఎంటర్‌ప్రైస్ ఆపరేషన్స్‌కు ‘గ్లోబల్ హబ్’గా పని చేయనుంది. 1200 మంది(హై స్కిల్డ్)కి ఉపాధి లభించనుంది.


