News March 16, 2024
CSKకు బిగ్ షాక్

వారం రోజుల్లో ఐపీఎల్ ప్రారంభంకానుండగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ పతిరణ గాయంతో ప్రారంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు సమాచారం. ఈ 21 ఏళ్ల బౌలర్ స్నాయువు గాయంతో బాధపడుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో కనీసం 4-5 వారాల పాటు ఆటకు దూరంగా ఉండే అవకాశం ఉంది. గత సీజన్‌లో 19 వికెట్లతో సత్తా చాటిన అతడు CSK టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించారు.
Similar News
News March 7, 2026
వేసవిలో దోసకాయలు తింటే?

దోసకాయల్లో 90 శాతం నీరు, పొటాషియం, మెగ్నీషియం, ఎలక్ట్రోలైట్స్, ఫైబర్, విటమిన్-C, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఎండలు ఎక్కువగా ఉండే వేసవి కాలంలో వీటిని తినడం వల్ల శరీరం ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంటుంది. రక్తపోటు, బరువు అదుపులో ఉంటుంది. జీర్ణక్రియ, చర్మ ఆరోగ్యం, మూత్రపిండాల పనితీరు మెరుగుపడుతుంది. కిడ్నీల్లో రాళ్లను నివారించవచ్చు. తక్షణ ఎనర్జీ లభిస్తుంది. హానికర టాక్సిన్స్ బయటికి వెళ్లిపోతాయి.
#ShareIt
News March 7, 2026
నెలకు ₹2,500.. ఫ్రీ బస్ జర్నీ: మహిళలకు TVK చీఫ్ వరాలు

తమిళనాడు ఎన్నికల దృష్ట్యా మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు TVK చీఫ్ విజయ్ కీలక హామీలు ప్రకటించారు. ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. లేడీస్ కోసం ప్రత్యేకంగా పోలీస్ విభాగం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. పేదలకు ఏటా ఫ్రీగా 6 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని తెలిపారు. పాఠశాల చిన్నారులకు ఏడాదికి ₹15 వేల ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. మహిళలకు నెలకు ₹2,500 ఇస్తామని హామీ ఇచ్చారు.
News March 7, 2026
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ప్రసక్తే లేదు: ప్రభుత్వ వర్గాలు

దేశంలో ఇంధన నిల్వలు మెరుగుపడుతున్నాయని, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ప్రసక్తే లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం తగ్గించేందుకు ఇతర మార్గాల ద్వారా క్రూడాయిల్ ఇంపోర్ట్స్‌ను 60% నుంచి 70%కి పెంచినట్లు తెలిపాయి. అలాగే ముప్పులేని పొరుగు దేశాలపై దాడులు చేయబోమని ఇరాన్ హామీ ఇవ్వడంతో హార్ముజ్ మార్గంలో రవాణా త్వరలోనే సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని వెల్లడించాయి.


