News December 30, 2024
మళ్లీ మాంజా పాశాలొస్తున్నాయ్..! జాగ్రత్త!!

సంక్రాంతికి సరదాగా ఎగురవేసే గాలిపటాలకు వాడే మాంజాలు మనకే పాశాలుగా మారుతున్నాయి. ఏటా చైనా మాంజాల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా జనగామ (TG)లో మాంజా దారం మెడకు చిక్కుకుని నలుగురు గాయపడ్డారు. సెలవులు ఇచ్చి, పండుగ దగ్గర పడేకొద్దీ పతంగులు ఎగరేయడం ఎక్కువవుతుంది. ఈ మాంజా వాడితే ప్రమాదాలూ ఎక్కువయ్యే అవకాశముంది. కాబట్టి గాలిపటం తెగినా ఫర్వాలేదు కానీ వీటిని వాడకండి.
Share It
Similar News
News January 21, 2026
ఏడేడు జన్మల బంధం సాధ్యమేనా?

భార్యాభర్తల బంధం ఒక్క జన్మకే పరిమితం కాదని పండితులు చెబుతున్నారు. ప్రతి జన్మలోనూ ఒకే వ్యక్తి భాగస్వామిగా రావడం కర్మ సూత్రాల ప్రకారం కష్టమైనప్పటికీ దైవానుగ్రహంతో సాధ్యమేనని వివరిస్తున్నారు. ఓ వ్యక్తి తన భాగస్వామి పట్ల నిష్కల్మష ప్రేమను కలిగి ఉండి, దైవచింతనతో కూడిన కఠినమైన తపస్సు, ప్రత్యేక ఆరాధన చేసినప్పుడు, ఆ భక్తికి మెచ్చి దేవుడు తదుపరి జన్మల్లో కూడా అదే తోడును ప్రసాదిస్తారని పండితుల అభిప్రాయం.
News January 21, 2026
నవీన్ పొలిశెట్టి కండిషన్స్ నిజమేనా?

హీరో నవీన్ పొలిశెట్టికి సంబంధించి ఓ వార్త వైరలవుతోంది. అదేంటంటే ఆయన కొత్తగా 2 కండిషన్స్ పెడుతున్నారంట. ‘ఒకటి రూ.15 కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వాలి. రెండోది మూవీ మొత్తం తానే చూసుకుంటారు’ అని అంటున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంటే నిర్మాత మూవీకి సంబంధించి ఎలాంటి జోక్యం చేసుకోకూడదు. బడ్జెట్ ఇస్తే ఆఖర్లో ఫస్ట్ కాపీ చూపిస్తారు. అయితే ఈ ప్రచారాల్లో నిజమెంత అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
News January 21, 2026
T20WC ఆడతామో.. లేదో: బంగ్లా కెప్టెన్

టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై సందిగ్ధత కొనసాగుతోంది. బోర్డు తీరుతో మీరు ఏకీభవిస్తున్నారా? అని బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్‌ను ఓ రిపోర్టర్ ప్రశ్నించగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ అంశంపై నేను మాట్లాడటానికి ఏమీ లేదు. వరల్డ్ కప్ ఇంకా చాలా దూరంలో ఉంది. జట్టు పాల్గొంటుందో లేదో నేను కచ్చితంగా చెప్పలేను. ఇండియాకు వెళ్లడానికి నిరాకరించే ముందు బోర్డు మాతో ఏమీ డిస్కస్ చేయలేదు’ అని చెప్పారు.


