News December 30, 2024
పేర్ని జయసుధకు ముందస్తు బెయిల్
AP: రేషన్ బియ్యం మిస్సింగ్ ఆరోపణల కేసులో మాజీ మంత్రి పేర్నినాని సతీమణి జయసుధకు కృష్ణా జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. జయసుధ పేరిట ఉన్న గౌడౌన్‌ను అద్దెకు ఇవ్వగా అక్కడున్న రేషన్ బియ్యం దారి మళ్లిందనే ఆరోపణలున్నాయి.
Similar News
News January 5, 2025
మారుతి 40 ఏళ్ల రికార్డును బద్దలుకొట్టిన టాటా
గత ఏడాది ఇండియాలో అత్యధికంగా అమ్ముడుపోయిన కార్ మోడల్‌గా టాటా పంచ్ నిలిచింది. 2024లో 2.02 లక్షల పంచ్ మోడల్ కార్లు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత మారుతి వ్యాగన్ R, ఎర్టిగా, బ్రెజా, హ్యుండాయ్ క్రెటా ఉన్నాయి. కాగా 1985-2004 వరకు మారుతి 800, 2005-2017 వరకు మారుతి ఆల్టో, 2018లో డిజైర్, 19లో ఆల్టో, 2020లో స్విఫ్ట్, 2021-22లో వ్యాగన్ R, 2023లో స్విఫ్ట్ ఎక్కువగా అమ్ముడైన కార్లుగా ఉన్నాయి.
News January 5, 2025
డియర్ పవన్ కళ్యాణ్ గారూ.. థాంక్యూ: చెర్రీ
‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్‌కు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన పవన్ కళ్యాణ్‌కు రామ్‌చరణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ‘డియర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు.. మీ అబ్బాయిగా, నటుడిగా, గర్వించదగ్గ భారతీయుడిగా మీకు ఎనలేని గౌరవం ఇస్తాను. నాకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన మీకు థాంక్యూ’ అని ఈవెంట్లో ఇద్దరూ కలిసి దిగిన ఫొటోలను Xలో షేర్ చేశారు. కాగా ఈవెంట్లో మాట్లాడుతూ చెర్రీ తనకు తమ్ముడిలాంటి వారని పవన్ చెప్పారు.
News January 5, 2025
Shock: ఆన్లైన్లో వెతికి తల్లి, నలుగురు చెల్లెళ్ల హత్య
లక్నోలో తల్లి, నలుగురు చెల్లెళ్లను <<15036079>>చంపేందుకు<<>> మహ్మద్ అర్షద్, తండ్రి బాదర్ ప్లాన్ చేసిన తీరు వణుకు పుట్టిస్తోంది. నొప్పి తెలియకుండా, ప్రతిఘటించకుండా ఎలా చంపాలో వారు మొబైల్లో వెతికారని దర్యాప్తులో వెల్లడైంది. కూల్‌డ్రింక్స్‌లో డ్రగ్స్, సెడేటివ్స్, విష పదార్థాలు కలిపి అచేతనంగా మార్చడం, సర్జికల్ నైవ్స్, ఇతర టూల్స్‌ను వాడి నరాలు కట్‌చేయడం వంటి మెథడ్స్‌ను సెర్చ్ చేసినట్టు అధికారులు చెప్తున్నారు.